Loading...
PM Modi: నానా పటేకర్‌ మృతిపై ప్రధాని మోదీ సంతాపం..
నానా పటేకర్‌ మృతిపై ప్రధాని మోదీ సంతాపం..

PM Modi: నానా పటేకర్‌ మృతిపై ప్రధాని మోదీ సంతాపం..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెటరన్‌ నటుడు నానా పటేకర్‌ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో తన విభిన్న నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన నానా పటేకర్‌ మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'ఓం శాంతి' అంటూ నివాళులర్పించారు. ''కొంతమంది నటుల్లో మాత్రమే కనిపించే తీవ్రత, వ్యక్తిత్వం, ప్రత్యేకమైన ఉనికి నానా పటేకర్‌లో ఉన్నాయి. ప్రతి పాత్రలోనూ ఆయన తన వైవిధ్యాన్ని, సృజనాత్మకతను చాటుకున్నారు. తరతరాలు గుర్తుంచుకునే పాత్రలను ప్రేక్షకులకు అందించారు'' అని మోదీ పేర్కొన్నారు.

వివరాలు 

హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలకు విశేష సేవలు

నటుడిగా మాత్రమే కాకుండా తన ముక్కుసూటి, నిర్మొహమాటమైన అభిప్రాయాలతోనూ నానా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని అన్నారు.

తాను విశ్వసించిన విషయాలను బహిరంగంగా చెప్పేందుకు ఆయన ఎప్పుడూ వెనుకాడేవారు కాదని కొనియాడారు.

హిందీ, మరాఠీ సినిమాలకు నానా పటేకర్‌ చేసిన సేవలు ఎంతో విలువైనవని మోదీ పేర్కొన్నారు.

ఆయన మరణం సినీ ప్రపంచంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానుల్లోనూ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు.

నానా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నానా పటేకర్‌కు మోదీ ఘన నివాళి

ADVERTISEMENT