LOADING...
Tortoise : రాజ్ తరుణ్-అమృత చౌదరి కొత్త మూవీ 'టార్టాయిస్' పూజా ప్రారంభం 
రాజ్ తరుణ్-అమృత చౌదరి కొత్త మూవీ 'టార్టాయిస్' పూజా ప్రారంభం

Tortoise : రాజ్ తరుణ్-అమృత చౌదరి కొత్త మూవీ 'టార్టాయిస్' పూజా ప్రారంభం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకంలో తెరకెక్కుతున్న సినిమా "టార్టాయిస్" కోసం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకత్వ బాధ్యత రిత్విక్ కుమార్ వహిస్తుండగా, నిర్మాణం శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు గార్ల సమిష్టి ప్రయత్నంతో సాగుతుంది. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

Details

సంగీతాన్ని అందించనున్న అనూప్ రూబెన్స్

లిరిక్స్ ఆస్కార్ విజేత చంద్రబోస్ అందించగా, సంగీతం అనూప్ రూబెన్స్ స్వరపరుస్తారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ టార్టాయిస్ చాలా కొత్త, డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం బాగా ఆకట్టుకుంటోంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌కు అవకాశమిచ్చిన మా నిర్మాతలకు శుభాకాంక్షలు. ఈ సినిమా నా కెరీర్‌లో మంచి కిక్ ఇస్తుందని నమ్ముతున్నానన్నారు. దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ మా సినిమా పూజ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులను స్వాగతిస్తున్నాను. టార్టాయిస్ కథ, స్క్రీన్‌ప్లే రెండూ కొత్తగా ఉంటాయి. రాజ్ తరుణ్ కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది.

Details

త్వరలోనే షూటింగ్ ప్రారంభం

శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, అమృత చౌదరి పాత్రలు బలంగా ఉంటాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. మోషన్ పోస్టర్ విడుదల చేసి ప్రమోషన్ మొదలుపెట్టాం. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలన్నారు. ఈ సినిమా థ్రిల్లర్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టనుంది.