Vishwambhara First Look: చిరంజీవి బర్తడే.. 'విశ్వంభర' పోస్టర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోసం యూవీ క్రియేషన్స్ 'విశ్వంభర' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. చిరంజీవి, వశిష్ఠ కాంబిణేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ పంచుకుంది. చేతిలో త్రిశూలంతో యాంగ్రీ లుక్‌లో ఉన్న చిరంజీవి పోస్టర్ అభిమానులను అకట్టుకుంటోంది. టీజర్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది.