NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Ram Charan-Prabhas: ప్రభాస్, రామ్ చరణ్ కాంబోలో పట్టాలెక్కని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే!
    తదుపరి వార్తా కథనం
    Ram Charan-Prabhas: ప్రభాస్, రామ్ చరణ్ కాంబోలో పట్టాలెక్కని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే!
    ప్రభాస్, రామ్ చరణ్ కాంబోలో పట్టాలెక్కని డ్రీమ్ ప్రాజెక్ట్

    Ram Charan-Prabhas: ప్రభాస్, రామ్ చరణ్ కాంబోలో పట్టాలెక్కని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 30, 2024
    05:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమాలు ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతున్నాయి.

    ఈ ప్రస్థానం బాహుబలి ద్వారా ప్రారంభమై అవిశ్రాంతంగా కొనసాగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కార్ దక్కింది.

    ఇటీవల విడుదలైన పుష్ప 2 చిత్రం, అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన నెంబర్ వన్ సినిమాగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు సినిమాలు ఈ మధ్య కాలంలో రూ.1000-1200 కోట్ల వరకు వసూళ్లను సాధిస్తున్నాయి.

    రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా ఎదగడానికి కారణమైంది.

    రామ్ చరణ్‌తో మగధీర విజయం తర్వాత, రాజమౌళి ప్రభాస్, రామ్ చరణ్‌లతో ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. కానీ అనివార్య కారణాలతో అది అమలు కాలేదు.

    Details

    మహేష్ బాబుతో హాలీవుడ్ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్న జక్కన్న

    ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, రూ.1350 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

    ప్రభాస్‌తో మరో హీరోతో కలిసి రాజమౌళి ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేస్తాడని అభిమానులు ఎదురు చూశారు. కానీ ప్రస్తుతానికి అలాంటి ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్రకటన లేదు.

    ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో హాలీవుడ్ స్థాయి అంతర్జాతీయ స్థాయి సినిమా రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ప్రిన్స్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.

    రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శంకర్ రూపొందించగా, దిల్ రాజు నిర్మించాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    ప్రభాస్
    రాజమౌళి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రామ్ చరణ్

    Ramcharan: రామ్ చరణ్ ని 'ఇడ్లీ వడా' అన్న షారుఖ్ ఖాన్..మండిపడుతున్న ఫాన్స్  సినిమా
    RC16: రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. ఓపెనింగ్ అప్డేట్..  సినిమా
    Ram Charan: పుట్టినరోజున అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న రామ్ చరణ్!  సినిమా
    RC17: పుట్టినరోజు ముందే అభిమానులకు రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్ ..రంగస్థలం కాంబో రిపీట్! సినిమా

    ప్రభాస్

    Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది సినిమా
    Kalki : మరో రికార్డును సృష్టించిన కల్కి.. రెండో బిగ్గెస్ట్ మూవీగా ఘనత కల్కి 2898 AD
    Prabhas : గ్రేట్.. వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం కొండచరియలు
    Mrunal Thakur: ప్రభాస్‌తో సినిమా.. చేయట్లేదు అని చెప్పిన మృణాల్ ఠాకూర్ మృణాల్ ఠాకూర్

    రాజమౌళి

    ఆర్ఆర్ఆర్ హిందీ రీమేక్: ఆలియా పాత్రలో క్రితిసనన్ అంటున్న ఏఐ  తెలుగు సినిమా
    బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు  తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్: కొమరం భీమ్ పాత్రను కొరడాతో కొట్టించిన నటుడు కన్నుమూత  ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?  మహేష్ బాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025