Prabhas Fauzi Glimpse: రెబల్స్ ఫ్యాన్స్‌కి ఫౌజీ గూస్‌బమ్స్... హే బ్రిటీషర్
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతారంలో పరిచయం చేస్తూ 'ఫౌజీ' చిత్రబృందం విడుదల చేసిన గ్లింప్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ ఓ సైనికుడిగా, వ్యూహకర్తగా, గూఢచారిగా కనిపించనున్నారు. 'ఫైల్ నెం.25' పేరుతో విడుదలైన ఈ వీడియోలో ఆయన పాత్రను పరిచయం చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Details
హిట్లర్‌తో బోస్ అదిరిపోయే మీటింగ్
1942లో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుంది.
జర్మనీలోని బెర్లిన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణతో గ్లింప్స్ మొదలవుతుంది.
బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు జర్మనీ సాయం కోరిన నేతాజీకి హిట్లర్ సందేహాలు వ్యక్తం చేస్తాడు.
ఈ క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని దెబ్బతీసిన ఓ భారతీయుడి గురించి నేతాజీ ప్రస్తావిస్తారు.
Details
ఫౌజీ ఇంటిలిజెన్స్
ఆ సైనికుడే 'ఫౌజీ'. బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌ను గందరగోళానికి గురిచేసి,వారి వ్యూహాలను తలకిందులు చేసిన వ్యక్తిగా అతడిని పరిచయం చేశారు.
భగవద్గీత ఆధారంగా ఎవరికీ అర్థంకాని కోడ్‌ను రూపొందించిన అతడి అసలు పేరు కూడా రహస్యమేనని గ్లింప్స్ చెబుతోంది.
చివర్లో సిగరెట్ తాగుతూ,భారీ మెషీన్ గన్ పట్టుకున్న ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం,విజువల్స్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాయి.
ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్,జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న'ఫౌజీ'ని 2027 మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ముందుగా 2026 డిసెంబర్‌లో రావాల్సిన సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ మరో చిత్రం'స్పిరిట్' విడుదల తేదీ కూడా మారినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
A Warrior With Intense Rage 🔥#Fauzi GLIMPSE OUT NOWhttps://t.co/oxh7yCT0vv
— T Series (@TSeriesFilmsS) October 23, 2026
A Battalion Who Fights Alone ⚔️#Prabhas #hanuraghavapudi #FauziGlimpse pic.twitter.com/5EjfYmqUAY