Prabhas Fauzi Movie: ఫౌజీని ముగించే పనిలో ప్రభాస్...ఫోకస్ అంతా ఈ సినిమాపైనే
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్న 'ఫౌజీ'పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ పనులు తుది దశకు చేరుకున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ తనకు సంబంధించిన దాదాపు అన్ని కీలక యాక్షన్ ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 'ఫౌజీ'ని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో డార్లింగ్ ఉన్నాడని సమాచారం.
Details
ప్రభాస్ పోర్షన్ దాదాపు పూర్తి
'ఫౌజీ'లో ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సినిమా కోసం కీలకంగా చిత్రీకరించిన మేజర్ యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ పాల్గొన్నాడని సమాచారం.
ఇప్పుడు మిగిలిన టాకీ పార్ట్‌ను కూడా త్వరలో పూర్తి చేయనున్నాడట. దీంతో షూటింగ్ పరంగా ప్రభాస్ ఫోకస్ పూర్తిగా 'ఫౌజీ'ని ముగించడంపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమా కథకు కీలకమైన సన్నివేశాలు పూర్తవుతుండటంతో.. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి తదుపరి ప్రాజెక్ట్ వైపు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నాడని టాక్.
Details
ఆ తర్వాత స్పిరిట్ వైపు అడుగులు
'ఫౌజీ' పూర్తయిన వెంటనే ప్రభాస్ తన దృష్టిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న 'స్పిరిట్'పై పెట్టనున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే కొంతకాలం వర్క్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' పనులు ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో 'స్పిరిట్' కోసం కేటాయించనున్నాడట.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు ప్రభాస్ షెడ్యూల్‌లో 'స్పిరిట్'కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నాడనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Details
ఆ తర్వాత కల్కి 2పై ఫోకస్
'స్పిరిట్'ను కూడా పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' పనుల్లోకి వెళ్లనున్నట్లు టాక్.
అంటే వరుసగా మూడు భారీ ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఆయన షెడ్యూల్ సాగుతోంది. ఒక సినిమా షూటింగ్ పూర్తవుతుండగానే మరో సినిమా పనులు మొదలయ్యేలా ప్రభాస్ తన లైనప్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం 'ఫౌజీ' ముగింపు దశకు చేరుకోవడం.. ఆ తర్వాత 'స్పిరిట్', అనంతరం 'కల్కి 2' వైపు వెళ్లనున్నాడనే వార్తలు డార్లింగ్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.