Pakistan A Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ 'ఎ'
ఈ వార్తాకథనం ఏంటి
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ 'ఎ' జట్టు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. శుక్రవారం దోహాలో జరిగిన రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ 'ఎ'పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని 4.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపులో హసన్ నవాజ్ కీలకంగా నిలిచాడు. బ్యాట్‌తో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు బంతితో రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంక 'ఎ'తో పాక్ తలపడనుంది.
Details
21 పరుగులకే రెండు వికెట్లు
233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 'ఎ'కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
కేవలం 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ బంగ్లాదేశ్ వైపు మొగ్గినట్టే కనిపించింది. కానీ హసన్ నవాజ్, షాజైబ్ ఖాన్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి నాలుగో వికెట్‌కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ భాగస్వామ్యమే పాకిస్థాన్ విజయానికి అసలు టర్నింగ్ పాయింట్‌గా మారింది. తర్వాత కెప్టెన్ అబ్దుల్ సమద్ 44, ఫర్హాన్ యూసుఫ్ 46 నాటౌట్‌తో బాధ్యతగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.
Details
సెంచరీ చేసినా షహదత్‌కు నిరాశే
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 'ఎ' నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 232 పరుగులు చేసింది.
ఆ జట్టులో షహదత్ హొస్సేన్ అద్భుతంగా ఆడి 103 పరుగులు చేశాడు. 118 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు.
మహిదుల్ ఇస్లాం అంకోన్‌తో కలిసి మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. అయితే షహదత్ పెవిలియన్‌కు చేరిన తర్వాత బంగ్లా బ్యాటింగ్ క్రమంగా బలహీనపడింది.
Details
పాక్ బౌలర్ల దెబ్బకు మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది
పాకిస్థాన్ బౌలర్లలో మణికట్టు స్పిన్నర్ సుఫియాన్ మోకిమ్ కేవలం రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.
అలీ రజా, హసన్ నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో భారీ స్కోరు చేసే అవకాశమున్న బంగ్లాదేశ్ 232 పరుగులకే పరిమితమైంది.
ఇక ఛేదనలో నవాజ్ చూపించిన ఆల్‌రౌండ్ ప్రతిభతో పాకిస్థాన్ 'ఎ' ఫైనల్‌కు చేరింది.
ఆదివారం శ్రీలంక 'ఎ'తో జరిగే తుది పోరులో టైటిల్ కోసం ఇరు జట్లు తలపడనున్నాయి.