Loading...
Arvind Kejriwal's Sheesh Mahal: రూ.11.56 లక్షల షాండ్లియర్.. రూ.5.69 లక్షల కర్టెన్లు.. కేజ్రీవాల్ శీష్ మహల్ తెరిచిన ఢిల్లీ సర్కార్
కేజ్రీవాల్ శీష్ మహల్ తెరిచిన ఢిల్లీ సర్కార్

Arvind Kejriwal's Sheesh Mahal: రూ.11.56 లక్షల షాండ్లియర్.. రూ.5.69 లక్షల కర్టెన్లు.. కేజ్రీవాల్ శీష్ మహల్ తెరిచిన ఢిల్లీ సర్కార్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గతంలో నివసించిన అధికారిక బంగ్లాను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ప్రజల సందర్శనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బీజేపీ నేతలు 'శీష్ మహల్'గా అభివర్ణించే ఈ నివాసంలోకి సామాన్య ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులను కూడా అనుమతించింది. ఈ సందర్భంగా భవనం ఆధునికీకరణ కోసం చేసిన ఖర్చులు, అక్కడ ఏర్పాటు చేసిన ఖరీదైన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర అలంకరణ వస్తువుల ధరలను ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

రూ.58.83 కోట్లకు చేరిన పునరుద్ధరణ ఖర్చు

బంగ్లా బయట ఏర్పాటు చేసిన భారీ బోర్డుపై ఈ భవనం పునరుద్ధరణ కోసం చేసిన మొత్తం వ్యయాన్ని రూ.58,83,66,314గా పేర్కొన్నారు.

అంటే దాదాపు రూ.58.83 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

భవనం లోపల ఉపయోగించిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, అలంకరణ వస్తువుల ధరలను ప్రత్యేక డిస్‌ప్లేల ద్వారా ప్రదర్శించారు. వాటిలో ఒక్కో వస్తువు కొనుగోలుకు ఎంత ఖర్చు చేశారో వివరంగా పొందుపరిచారు.

వివరాలు 

లక్షల రూపాయల విలువైన అలంకరణ వస్తువులు

ప్రదర్శనలో ఉంచిన వివరాల ప్రకారం.. ఈ బంగ్లాలో ఏర్పాటు చేసిన షాండ్లియర్ల (అలంకార దీప గుచ్చాలు) విలువ రూ.11లక్షలుగా ఉంది.

కర్టెన్ల కోసం రూ.5,69,162 ఖర్చు చేశారు. డైనింగ్ టేబుల్, కుర్చీల కొనుగోలుకు రూ.5,58,885 వెచ్చించారు. అలాగే రౌండ్ సైడ్ టేబుళ్ల కోసం రూ.10లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

డబుల్ బెడ్ల విలువ రూ.1,96,482 కాగా,కన్సోల్ యూనిట్ల కోసం రూ.3,34,484 ఖర్చు చేశారు.

ప్రభుత్వ ఖజానా నుంచి, అంటే ప్రజలు చెల్లించిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బును ఏయే పనులకు ఎంత ఖర్చు చేశారో ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలను బహిరంగంగా ప్రదర్శించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

ఖర్చుల విషయంలో పారదర్శకత తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

కేజ్రీవాల్‌పై ఢిల్లీ మంత్రుల విమర్శలు

ఈ వ్యవహారంపై ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ తీవ్రంగా స్పందించారు.

గతంలో కారు, బంగ్లా వంటి సౌకర్యాలు తీసుకోనని, తనకు కేవలం రెండు గదుల ఇల్లు సరిపోతుందని చెప్పిన వ్యక్తి.. తన నివాసం కోసం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని విమర్శించారు.

ఈ భవనం కోసం మొదట సుమారు రూ.8 కోట్ల బడ్జెట్ అంచనా వేయగా, చివరకు వ్యయం రూ.58 కోట్లకు పైగా చేరిందని ఆరోపించారు.

మరో మంత్రి కపిల్ మిశ్రా కూడా కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు.

ADVERTISEMENT

వివరాలు 

కేజ్రీవాల్‌పై ఢిల్లీ మంత్రుల విమర్శలు

కరోనా మహమ్మారి కారణంగా దేశం తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే ఈ 'శీష్ మహల్' నిర్మాణ పనులు చేపట్టారని ఆరోపించారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత భారీ మొత్తాన్ని విలాసవంతమైన నివాసం కోసం ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఈ బంగ్లా అలంకరణ కోసం వియత్నాం నుంచి ప్రత్యేక మార్బుల్‌ను తెప్పించారని, ఇతర దేశాల నుంచి ఆటోమేటిక్ లిఫ్టులు, క్రాకరీ సామగ్రి, టేబుళ్లను దిగుమతి చేసుకున్నారని కపిల్ మిశ్రా పేర్కొన్నారు.

అంతేకాకుండా ఒక్కో షాండ్లియర్‌కే రూ.11 లక్షలు వెచ్చించారని విమర్శించారు.

ఈ వస్తువులన్నింటినీ ప్రస్తావిస్తూ, కేజ్రీవాల్ నివాసాన్ని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారని ఆయన ఆరోపించారు.

ADVERTISEMENT