Yashasvi Jaiswal: సచిన్ రికార్డును దాటేసిన యశస్వి.. 33 టెస్టుల్లో అరుదైన ఘనత!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో తొలి 33 మ్యాచ్‌లను 33 వేర్వేరు వేదికల్లో ఆడిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు ఇద్దరే కాగా.. వారిద్దరూ భారతీయులే కావడం విశేషం. గతంలో మాజీ క్రికెటర్, ప్రస్తుత వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఈ రికార్డు సాధించాడు. ఇప్పుడు యశస్వి అతడి సరసన చేరాడు. క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో యశస్వి తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో ఈ ఘనత సాధించాడు. 1994 తర్వాత తొలి 33 టెస్టులను విభిన్న వేదికల్లో ఆడిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు.
వివరాలు
విండీస్‌పై అరంగేట్రం.. అద్భుత ప్రదర్శన
ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ (32 టెస్టులు) రికార్డును కూడా అధిగమించాడు. యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
అప్పటి నుంచి భారత జట్టులో ఓపెనర్‌గా కీలకంగా మారాడు.
ఇప్పటివరకు 33 టెస్టులు ఆడిన అతడు.. 48.16 సగటు, 67.14 స్ట్రైక్‌రేట్‌తో 2,697 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి.
వివరాలు
సంజయ్ మంజ్రేకర్ రికార్డు ఇదే
మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ 1987లో భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు.
తన కెరీర్‌లో మొత్తం 37 టెస్టులు ఆడిన అతడు.. తొలి 33 మ్యాచ్‌లను వేర్వేరు వేదికల్లో ఆడాడు. సుమారు ఏడేళ్ల వ్యవధిలో ఈ ఘనత సాధించాడు.
టెస్టుల్లో మొత్తం 2,043 పరుగులు చేశాడు. ఇక 74 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 1,994 పరుగులు సాధించాడు. 1996లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.