Loading...
DMK Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే ఓకే.. స్టాలిన్ కీలక నిర్ణయం!
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే ఓకే.. స్టాలిన్ కీలక నిర్ణయం!

DMK Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే ఓకే.. స్టాలిన్ కీలక నిర్ణయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలతో చీఫ్‌ ఎం.కె. స్టాలిన్‌ సోమవారం చెన్నైలో సమావేశమయ్యారు. ఈ భేటీలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు డీఎంకే ఎంపీ ఎ.రాజా వెల్లడించారు.

వివరాలు

తమిళనాడు సీట్ల వాటా మారకూడదు

లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటా మారకూడదనేది తమ ప్రధాన డిమాండ్ అని ఎ.రాజా తెలిపారు.

ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో సీట్ల సంఖ్య 59కి పెరగడంపై అంగీకారం తెలిపామన్నారు.

అయితే కొన్ని విధానపరమైన అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని పేర్కొన్నారు.

అవసరమైన సవరణలను ప్రతిపాదించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తమకు పూర్తి అధికారం ఇచ్చారని ఎ.రాజా వెల్లడించారు.

డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్‌తో కూటమిలో ఉన్నప్పుడు అనుసరించిన వైఖరినే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నామని మీడియాతో చెప్పారు.

వివరాలు

లోక్‌సభ స్థానాల పెంపునకు కేంద్రం ఆమోదం

ప్రస్తుతం చేపడుతున్న జనగణనతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపింది.

ఈ బిల్లును ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.

ADVERTISEMENT