
Prabhas: ప్రభాస్-హను రాఘవపూడి మూవీ స్టార్ట్.. ఫోటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఉన్నాడు.
తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా ప్రారంభమైంది.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ప్రకటించింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీనికి సంబంధించిన అప్డేట్ ఇవాళ సాయంత్రం 04.05 గంటలకు ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
Details
కొత్త లుక్ లో ప్రభాస్
ఇప్పటికే ఈ మూవీ కోసం విశాల్ చంద్రశేఖర్ మూడు పాటలను కంపోజ్ చేసినట్లు హను రాఘవపూడి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రానుంది.
ఈ చిత్రం ప్రారంభంలో పాల్గొన్న ప్రభాస్ లుక్ కొత్తగా ఉంది.
ఈ మూవీలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్నది ఇంకా చిత్ర యూనిట్ వెల్లడించలేదు.