Prabhas: ఫస్ట్ టైం బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్.. ఫౌజీ షెడ్యూల్ లాక్
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి కొత్త అవతారంలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో ఆయన సైనికుడిగా నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.
తాజాగా ప్రభాస్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, మరోవైపు సైనికుడి పాత్రలో కూడా కనిపించనున్నాడు.
ప్రస్తుతం కాలి గాయం నుంచి కోలుకుంటున్న ప్రభాస్, 'రాజా సాబ్' చిత్రానికి సంబంధించిన పెండింగ్ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే, ఈ సినిమాకు అడ్జెస్ట్ చేయనున్నారు.
Details
వచ్చే ఏడాది మూవీ రిలీజ్
ఫౌజీ కొత్త షెడ్యూల్ తమిళనాడులోని మధురై సమీపంలోని కరైకుడిలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కీలకమైన కుటుంబ నేపథ్య ఘట్టాలను చిత్రీకరించనున్నారు.
ప్రధానంగా దేవిపురం అగ్రహారాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ భాగాన్ని 20 రోజుల పాటు షూట్ చేస్తారని సమాచారం. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కావడంతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీగా కూడా ఉంటుందట.
స్వాతంత్య్రానికి ముందు కాలం నేపథ్యంలో సాగే కథలో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.