Prabhas: ప్రభాస్‌కు గాయం.. త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు!
స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్ర, ఈశ్వర్ వంటి చిత్రాలతో సినీ రంగానికి పరిచయమైన ప్రభాస్, బాహుబలి సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్, వరుసగా భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ప్రభాస్ షూటింగ్‌లో గాయపడినట్లు సమాచారం. తన చీలమండ బెనికిందని ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ఈ కారణంగా జపాన్‌లో డిసెంబర్ 3న విడుదల కానున్న కల్కి 2898 AD చిత్ర ప్రమోషన్లకు హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు.
వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ బీజీ
డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుందని వివరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న *రాజా సాబ్* సినిమా, హను రాఘవపూడితో ఫౌజీ, అలాగే కల్కి 2898 AD సీక్వెల్, స్పిరిట్, సలార్ 2 వంటి భారీ చిత్రాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.