Prabhas: ప్రభాస్ ఓ స్టార్ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. సెలబ్రిటీల బర్త్‌డే విషెస్!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి మొదలైంది. రెబల్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సినీ ప్రముఖులు వరుసగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, ప్రభాస్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లోని సన్నివేశాలు, డైలాగులతో నిర్మాణ సంస్థలు ప్రత్యేక మ్యాషప్ వీడియోలను రూపొందించి ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతున్నాయి. అభిమానులు కూడా తమ అభిమాన హీరోపై ప్రేమను వివిధ రూపాల్లో చాటుకుంటున్నారు.
వివరాలు
ప్రభాస్‌కు దర్శకుడు మారుతి ప్రత్యేక శుభాకాంక్షలు
ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకుడు మారుతి ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ప్రభాస్ కేవలం ఓ స్టార్ మాత్రమే కాదని.. ఆయన ఓ భావోద్వేగం, స్ఫూర్తి, అద్భుతమని కొనియాడారు.
ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రభాస్ కష్టపడే తత్వం, వినయం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు.
ఆయన మరిన్ని బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తాను ఎప్పటికీ ప్రభాస్ అభిమానినేనని, ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటానని మారుతి తన సందేశంలో పేర్కొన్నారు.
వివరాలు
ఆది సాయికుమార్, మెహర్ రమేశ్, నారా రోహిత్ విషెస్
నటుడు ఆది సాయికుమార్ కూడా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ అన్న మంచితనమే ఆయనను ఇంత గొప్ప వ్యక్తిగా నిలబెట్టిందని పేర్కొన్నారు.
ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, మరెన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకున్నారు. దర్శకుడు మెహర్ రమేశ్ తనదైన శైలిలో ప్రభాస్‌కు విషెస్ చెప్పారు.
'హ్యాపీ బర్త్‌డే డార్లింగ్. మెరుపే మనిషైతే నీలా ఉంటుందేమో'' అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. నటుడు నారా రోహిత్ కూడా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, ఇలాగే అందరికీ స్ఫూర్తినిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
వివరాలు
వీడియోతో సందడి చేసిన జపాన్ అభిమానులు
ప్రభాస్‌కు భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అభిమానగణం ఉంది. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి అభిమానులు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వీడియోలో అభిమానులు కేక్ కట్ చేసి, పుట్టినరోజు పాట పాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ప్రభాస్ జపాన్‌కు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, మరోసారి అక్కడికి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఆయన నటించిన కొత్త సినిమాలను చూసేందుకు తాము భారత్‌కు రావాలని కోరుకుంటున్నట్లు తమ సందేశంలో పేర్కొన్నారు.
ప్రభాస్‌పై జపాన్ అభిమానులు చూపించిన ప్రేమకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.