
Fauji: ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. ఘాటుగా స్పందించిన మూవీ టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ హీరోగా,దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఫౌజీ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో, నిన్న సినిమా సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ కావడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వింటేజ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ ఫొటోలు అభిమానులు తెగ షేర్ చేయడంతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయాయి. అయితే ఈ పరిణామంపై సినిమా బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "ఈ సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు.ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్స్ ఇవ్వడానికి మేము కష్టపడుతున్నాం.కానీ సెట్స్ నుంచి హీరో లుక్ బయటపడటం మాకు షాక్ ఇచ్చింది,"అంటూ టీమ్ స్పష్టంచేసింది.
వివరాలు
స్టైలిష్‌గా,హ్యాండ్సమ్‌గా లీక్ అయిన లుక్‌లో ప్రభాస్
ఇకపై ఇలాంటి లీకులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారు హెచ్చరించారు. "లుక్ లీక్ చేసి షేర్ చేసే వారిపై ఇక కఠినంగా వ్యవహరిస్తాం.అలాంటి వారి ఐడీలను వెంటనే బ్లాక్ చేయడంతోపాటు,సైబర్ క్రైమ్ పరిధిలో కేసులు నమోదు చేసి జైలుకు పంపించాల్సి వస్తుంది,"అని బృందం స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే,ఫౌజీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. లీక్ అయిన లుక్‌లో ఆయన మరింత స్టైలిష్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారని అభిమానులు అంటున్నారు. గత సినిమాలతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ కొత్త తరహా లుక్‌లో కనిపించడం ప్రత్యేకతగా మారింది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయని సమాచారం.