
Rebel Star : రాధేశ్యామ్ డైరక్టర్ తో ప్రభాస్ మూవీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్' షూటింగ్‌లో పాల్గొంటూ, తాజగా సాంగ్స్ షూట్ కోసం యూరప్ వెళ్లింది యూనిట్. ఇదే సమయంలో హనురాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాలో కూడా నటిస్తున్నాడు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సరికొత్త ప్రభాస్‌ను చూడబోతున్నామని యూనిట్ చెబుతోంది. వీటితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2', నాగ అశ్విన్ డైరెక్షన్‌లో 'కల్కి 2' కూడా లైన్‌లో ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయమే ఫ్యాన్స్‌లో ఆందోళన రేపుతోంది. కారణం దర్శకుడు రాధాకృష్ణ కుమార్. 'జిల్' సినిమాతో దర్శకుడిగా రాధాకృష్ణ పరిచయం అయ్యాడు.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు
మేకింగ్ పరంగా మంచి మార్కులు సంపాదించినప్పటికీ, ఆ సినిమా బీ-సెంటర్లలో యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. వాస్తవానికి ఆ ప్రాజెక్ట్‌లో హీరో ప్రభాస్ కావాల్సి ఉన్నా, ఆయన సూచన మేరకు గోపిచంద్ హీరోగా చేశాడు. జిల్ తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకుని, రాధాకృష్ణ ప్రభాస్‌తో కలిసి 'రాధేశ్యామ్' అనే పాన్‌ఇండియా చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీఅంచనాలు, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా చివరికి పెద్ద డిజాస్టర్‌గా మారింది. ముఖ్యంగా రెబెల్ స్టార్‌ను పెట్టుకుని ఒక్క ఫైట్ కూడా చూపించకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ మళ్లీ ప్రభాస్‌కు కథ చెప్పగా, ఆయన ఒకే చెప్పాడట. దీంతో ఇప్పుడి రాధాకృష్ణతో సినిమా అవసరమా డార్లింగ్?" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.