NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas : ప్రపంచ యుద్ధం చేయనున్న ప్రభాస్.. ఎన్ని కోట్లతో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Prabhas : ప్రపంచ యుద్ధం చేయనున్న ప్రభాస్.. ఎన్ని కోట్లతో తెలుసా
    ప్రపంచ యుద్ధం చేయనున్న ప్రభాస్.. ఎన్ని కోట్లతో తెలుసా

    Prabhas : ప్రపంచ యుద్ధం చేయనున్న ప్రభాస్.. ఎన్ని కోట్లతో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 20, 2023
    10:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బాహుబలి ఫేమ్, పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ హీరో ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు, ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్ అందించనున్నారు. ఈ మేరకు ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు.

    సీతారామం సినిమాతో భారీ హిట్ కొట్టిన హను రాఘవపూడితో ఈ సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

    వరల్డ్ వార్-2 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

    సుమారు రూ.300 కోట్లకుపైగా ఖర్చుతో ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తారని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ఈ మేరకు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ సహా యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా బాహుబలి లాంటి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

    Details

    మరో రెండేళ్ల సమయం అవసరం 

    మరోవైపు ఈ సినిమా పట్టాలు ఎక్కాలంటే చాలా సమయం పట్టేలా ఉంది. మరో రెండేళ్లు ప్రభాస్ కొత్త సినిమాలు చేసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది.

    ఇటీవలే ప్రభాస్ కి మోకాలి సర్జరీ జరగ్గా నెల రోజులకుపైగా విదేశాల్లో విశ్రాంతి తీసుకుని ఈ మధ్యే ఇండియాకు వెనక్కి వచ్చేశారు.

    ఇదే సమయంలో సలార్ విడుదలకు సిద్ధం అవుతుండగా, కల్కి, రాజా డీలక్స్ సెట్స్ పై ఉన్నాయి.

    ఇప్పటికే రిలీజైన రాధే శ్యామ్, ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయాయి. సాహో ఓ మోస్తరు విజయం అందుకుని హిందీలో రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

    details

    డిసెంబర్ 22న సలార్

    ఒకరకంగా బాహుబలి-2 తర్వాత ప్రభాస్ కి ఆ స్థాయిలో హిట్ రాలేదు. ఈ క్రమంలోనే డిసెంబర్ 22న విడుదల కానున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

    అనంతరం ప్రభాస్ నుంచి కల్కి 2898 AD రావాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా, దర్శకుడు నాగ్ అశ్విన్ సోషియో ఫాంటసీ కథతో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా మలుస్తున్నాడు.

    కల్కి వచ్చే సంవత్సరం విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా డీలక్స్ కామెడీ హారర్ థ్రిల్లర్ అని అంటున్నారు.

    సలార్ కి సీక్వెల్ గా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ ఓ ప్రాజెక్టు చేయనున్నారు. స్పిరిట్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్

    తాజా

    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్
    PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన నరేంద్ర మోదీ

    ప్రభాస్

    ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్  ప్రాజెక్ట్ కె
    మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు  కమల్ హాసన్
    రామ్ చరణ్ తో కలిసి పనిచేస్తానంటున్న ప్రభాస్: అభిమానులకు పూనకాలే  రామ్ చరణ్
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  కల్కి 2898 AD
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025