The Raja Saab : ప్రభాస్ 'రాజా సాబ్' రెండో పాట రిలీజ్‌కు డేట్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ చిత్రం 'ది రాజా సాబ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రభాస్ లుక్, స్టైలింగ్ పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయని సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్స్ట్ సాంగ్‌పై కూడా ఆయన కీలక అప్‌డేట్ ఇచ్చారు.
Details
జనవరి 5న రిలీజ్
'నాచో నాచో' అంటూ సాగే రెండో సింగిల్‌ను జనవరి 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తొలి పాటలో ప్రభాస్ స్టెప్పులు చూసి 'వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్' అంటూ ఫ్యాన్స్ సంబరపడగా, ఈ రెండో పాట మరింత ఎనర్జీతో పూనకాలు తెప్పించేలా ఉండనుందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకానుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మరోసారి తన మార్కెట్ పవర్‌ను నిరూపించనున్నాడనే అంచనాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రిలీజ్ తేదీ చెప్పిన తమన్
#NacheNache on 5 th ❤️🙌🏿
— thaman S (@MusicThaman) January 3, 2026
Prabhas anna costumes and styling 📈🙌🏿🙌🏿🙌🏿🙌🏿