Page Loader
Prabhas-Maruthi: ఆ రోజే ప్రభాస్-మారుతీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల 
Prabhas-Maruthi: ఆ రోజే ప్రభాస్-మారుతీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

Prabhas-Maruthi: ఆ రోజే ప్రభాస్-మారుతీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల 

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

'సలార్' సక్సెస్‌తో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ).. మారుతి దర్శకత్వం మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణ దశలో ఉంది. అయితే మూవీకి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 15వ తేదీ ఉదయం 07:08 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మూవీలో మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీల్లో ప్రభాస్‌ను ప్రేక్షకులు చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ ట్వీట్