సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. భారత ఇతిహాస గాథ రామాయణాన్ని వెండితెర మీద సరిగ్గా చూపించలేకపోయారని దర్శకుడు ఓం రౌత్ మీద విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన మీద విపరీతంగా పడింది. అయితే ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ విడుదలపై కనీసం చిన్న ప్రకటన కూడా ఇవ్వకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం వెర్షన్లు మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నాయి.
హిందీ వెర్షన్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఆదిపురుష్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈరోజు శుక్రవారం సైలెంటుగా అన్ని వెర్షన్లలో ఓటీటీ ప్రేక్షకుల కోసమ్ ఆదిపురుష్ వచ్చేసింది. థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను మిస్సయిన వారు ఇంట్లోనే ఓటీటీలో చూడవచ్చు. ఈ సినిమాను టీ సిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్త నాగి నటించారు. ఇంకా ఇతర పాత్రల్లో సోనాల్ చౌహాన్, వత్సల్ సేత్, తృప్తి తోరడ్ మల్ కనిపించారు.