Prabhas: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. 'ఫౌజీ' నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు 'ఫౌజీ' చిత్ర బృందం అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చారిత్రక డ్రామా నుంచి తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సైనికుడి పాత్రలో ప్రభాస్ ఇంటెన్స్ లుక్‌ను పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలను పెంచింది. "అతను ఎవరు?" అనే ప్రశ్నకు సమాధానంగా ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ పాతకాలం నాటి వింటేజ్ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్ని కీలల మధ్యలో కనిపిస్తున్న ఓ బంగారు నాణెంపై మిలటరీ యూనిఫాంలో ఉన్న ప్రభాస్ సైడ్ ప్రొఫైల్‌ను ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించారు.
వివరాలు
ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్న మూవీ
పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్లు కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. "ఫైల్ నెం: #25 డిక్లాసిఫై చేస్తున్నాం", "ఒంటరిగా పోరాడే బెటాలియన్", "1939 నుంచి మోస్ట్ వాంటెడ్" అనే పదాలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఈ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం.. "ఫైల్ నెం: #25 డిక్లాసిఫై చేస్తున్నాం. 'అతను ఎవరు?' అనే ప్రశ్నకు ఈరోజు వీడియోతో సమాధానం దొరుకుతుంది.
హ్యాపీ బర్త్‌డే, #ఫౌజీ" అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ప్రభాస్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'సీతారామం' వంటి క్లాసిక్ ప్రేమకథను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
వివరాలు
పక్కా ప్రణాళికతో దర్శకుడు
చరిత్రలో మరుగునపడిపోయిన ఓ సైనికుడి కథ ఆధారంగా ఈ పీరియడ్ ఫిల్మ్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్‌ను గతంలో ఎన్నడూ చూడని పాత్రలో చూపించేందుకు దర్శకుడు హను రాఘవపూడి పక్కా ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ కొత్త పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది? కథ ఏ చారిత్రక నేపథ్యంతో సాగనుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి చిత్ర బృందం విడుదల చేయనున్న క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.