NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మెగాస్టార్ చిరంజీవి చేతిలో మరో సినిమా.. ప్రభుదేవాకు అవకాశం?
    తదుపరి వార్తా కథనం
    మెగాస్టార్ చిరంజీవి చేతిలో మరో సినిమా.. ప్రభుదేవాకు అవకాశం?
    చిరంజీవి, ప్రభుదేవా

    మెగాస్టార్ చిరంజీవి చేతిలో మరో సినిమా.. ప్రభుదేవాకు అవకాశం?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 04, 2023
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు బాక్సాఫీసుకు సంక్రాంతి సంబరం తీసుకువచ్చే పనిలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై అభిమానులందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి.

    ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాల్తేరు వీరయ్య తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ రూపుదిద్దుకుంటోంది.

    భోళాశంకర్ తర్వాత డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో సినిమా ఉంటుందని వినిపిస్తోంది. ఇప్పటికైతే కథ లైన్ వినిపించారని, అది చిరంజీవికి బాగా నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ప్రభుదేవా ఉన్నారని అంటున్నారు.

    చిరంజీవి

    ప్రభుదేవాతో రెండవ చిత్రం

    ఇదివరకు ప్రభుదేవా దర్శకత్వంలో "శంకర్ దాదా జిందాబాద్" సినిమాను చేసారు చిరంజీవి. దాని తర్వాత ప్రభుదేవాతో సినిమా చేయలేదు. మొన్నటికి మొన్న గాడ్ ఫాదర్ సినిమాలో తార్ మార్ అనే పాట కోసం చిరంజీవిని కలిసారు ప్రభుదేవా.

    అదే టైమ్ లో కథా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. దీని గురించి ఇంకా పూర్తి సమాచారం రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

    ప్రస్తుతం వాల్తేరు వీరయ్య రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పట్లో ప్రకటన వచ్చే అవకాశం లేదు. ఐతే ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ మూవీ, ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది.

    మరి ప్రభుదేవాతో మళ్ళీ సినిమా అంటే మెగా అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    తెలుగు సినిమా

    తాజా

    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్
    Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్ హైదరాబాద్
    Nirav Modi: యూకే హైకోర్టులో నీర‌వ్ మోదీకి షాక్‌.. బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌ యునైటెడ్ కింగ్డమ్
    Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి  తెలంగాణ

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025