Meenakshi Chaudhary: సైన్స్ ఫిక్షన్ తరహాలో ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్‌గా మీనాక్షి?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినిమా పరిశ్రమలో 'లవ్ టుడే'తో నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటిన హీరో ప్రదీప్ రంగనాథన్, మరోసారి కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నాడు. యువతను ఆకట్టుకునే కథలతో ప్రసిద్ధి చెందిన ప్రదీప్, ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కొత్త చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రదీప్ సరసన మీనాక్షి చౌదరి నటించనుందట. ప్రదీప్ సన్నిహిత వర్గాల వివరాల ప్రకారం, 'ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మీనాక్షికి, రాబోయే ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు
ప్రదీప్ స్వీయ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మునుపటి చిత్రాల మాదిరి కాకుండా, భిన్నమైన దృశ్యాలు, కథనం ఇందులో ఉంటాయి. మార్చిలో సెట్స్‌పైకి వెళ్లి, ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని ప్రదీప్ సన్నిహితులు వెల్లడించారు. అందువల్ల, ప్రదీప్-మీనాక్షి జోడీ తెరపై సృష్టించే మ్యాజిక్‌ను చూడాలంటే ప్రేక్షకులు కొన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఉంది.