Page Loader
Pushpa 2: పుష్ప 2 విడుదలపై రూమర్లకు చెక్‌ పెట్టిన నిర్మాత.. ఈ నెల నుండి ప్రమోషన్లు షురూ 
పుష్ప 2 విడుదలపై రూమర్లకు చెక్‌ పెట్టిన నిర్మాత

Pushpa 2: పుష్ప 2 విడుదలపై రూమర్లకు చెక్‌ పెట్టిన నిర్మాత.. ఈ నెల నుండి ప్రమోషన్లు షురూ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2024
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ మోస్ట్ అవైటెడ్‌ సినిమాల్లో 'పుష్ప 2' ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఈ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతుంది. 'పుష్ప: ది రైజ్‌'విడుదలై మూడేళ్లు అయ్యింది.ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఆ విజయం నేపథ్యంలోనే సీక్వెల్‌ కూడా ప్రకటించారు మేకర్స్. అయితే, పుష్ప 2 షూటింగ్‌ ఇంకా పూర్తికాకపోవడంతో,సినిమా విడుదలపై పలు పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. మొదట ఆగష్టు 15న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ,అనుకోకుండా సినిమా విడుదలను డిసెంబర్‌ 6కి వాయిదా వేశారు. దీనితో, డైరెక్టర్‌ సుకుమార్‌,అల్లు అర్జున్‌ మధ్య విభేదాలు ఉన్నాయనే రూమర్స్‌ వచ్చాయి. ఈ రూమర్స్‌కు చెక్‌ పెట్టేందుకు, ఇటీవల'మారుతి నగర్‌ సుబ్రమణ్యం'ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి హాజరయ్యారు.

వివరాలు 

షూటింగ్‌ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవిశంకర్‌

ఇటీవల 'పుష్ప 2'పుకార్లపై నిర్మాత రవిశంకర్‌ స్పందించారు.షూటింగ్‌ సాఫీగా సాగుతోందని, డిసెంబర్‌ 6న సినిమా విడుదలచేస్తున్నామని అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 2న ఫస్ట్‌ హాఫ్‌ ఎడిటింగ్‌ పూర్తిచేస్తామని,అక్టోబర్‌ 6న సెకండాఫ్‌ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. నవంబర్‌ 28వరకు పూర్తి కాపీ సిద్ధం చేసి,వరల్డ్‌వైడ్‌ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితికి మూవీ అప్డేట్స్‌ ఏం లేవని తెలిపిన నిర్మాత..సెప్టెంబర్‌,అక్టోబర్‌ నెలల్లో పాటలను విడుదల చేస్తామని తెలిపారు. పుష్ప 2కి సంబంధించి ఇంకా రెండు పాటలు విడుదలకు ఉన్నట్లు తెలిపారు.సినిమా ప్రీమియర్స్‌ కూడా విడుదల ముందు రోజే ఉంటాయని నిర్మాత వివరించారు. ఈఅప్‌డేట్‌తో పుష్ప 2 విడుదలపై వచ్చిన పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.