NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్
    తదుపరి వార్తా కథనం
    భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్

    భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 09, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళాశంకర్ మూవీ షూటింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర్, ట్విట్టర్ వేదికగా ఒక అప్డేట్ ఇచ్చారు.

    పాటల రచయిత కాసర్ల శ్యామ చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ, ఈ అప్డేట్ అందించాడు. కాసర్ల శ్యామ్ ట్వీట్ చేస్తూ, భోళాశంకర్ సినిమా కోసం ఓ పాట రాసాననీ, చిరకాల కల నెరవేరుతున్న వేళ నా దిల్లులో డీజేలు మోగుతున్నాయని అన్నారు.

    ఆ మాటకు రిప్లై ఇచ్చిన నిర్మాత అనిల్ సుంకర, భోళాశంకర్ లో మీరు రాస్తున్న ఆ పాట, బెస్ట్ సాంగ్ అవుతుందని అన్నారు. దీంతో మెగా అబిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

    చిరంజీవి

    అ పాట జానపదం అయ్యే అవకాశం ఉందని కామెంట్లు

    కాసర్ల శ్యామ్ ఈ మధ్య రాసిన పాటలు దాదాపుగా హిట్టే. అవి కూడా ఎక్కువ శాతం జానపద పాటలే ఉన్నాయి. అలవైకుంఠపురములో సినిమాలో రాములో రాములా దగ్గరి నుండి మొన్నటి ధమాకాలోని జింతాకా వరకూ అన్నీ జానపదంతో కూడుకున్నవే.

    ఇప్పుడు చిరంజీవి భోళాశంకర్ లోనూ అలాంటి పాటే ఉంటుందని, జానపదమే ఉండాలని, ఆ పాటకు చిరంజీవి డ్యాన్స్ వేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

    తమన్నా భాటియా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

    ఈ సినిమాని వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కాసర్ల శ్యామ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన నిర్మాత అనిల్ సుంకర

    This song will be for sure one of the best Shyam garu.👍👍👍👍👍 https://t.co/Vk0iBeGKWV

    — Anil Sunkara (@AnilSunkara1) February 9, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్

    This song will be for sure one of the best Shyam garu.👍👍👍👍👍 https://t.co/Vk0iBeGKWV

    — Anil Sunkara (@AnilSunkara1) February 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి

    తాజా

    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025