Salaar: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లా సలార్ పార్ట్-2.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన చిత్రం సలార్(Salaar) బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. సలార్ హిట్ కావడంతో ఇక సలార్ పార్ట్ 2(Salaar Part 2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని సీక్వెల్ కోసం ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సలార్ పార్ట్ 2' విడుదలపై నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడారు. 2025లో సలార్ పార్ట్ 2 చిత్రాన్ని విడుదల చేస్తామని పేర్కొన్నారు.
15 నెలల్లోనే సలార్ పార్ట్ 2 పూర్తి చేయడానికి ప్లాన్
సలార్ 2 స్క్రిప్టు సిద్ధమైందని, ఎప్పుడైనా చిత్రీకరణను ప్రారంభించే అవకాశాలున్నాయని విజయ్ కురగందూర్ చెప్పారు ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారని, 15 నెలల్లోనే పార్ట్ 2 పూర్తి చేయడానికి ప్లాన్ చేశామన్నారు. సలార్ పార్ట్ 2 'గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉండనుందని, యాక్షన్, డ్రామా, పాలిటిక్స్ ఇలా పలు అంశాలు సీక్వెల్‌లో కన్పిస్తాయన్నారు. సలార్ వసూళ్లపై సంతృప్తిగా ఉన్నామని, కొంత నెగెటివిటీ ఉన్నా మేకింగ్ విషయంలో ఎవరూ విమర్శించలేదని అని పేర్కొన్నారు.