Gangnam style: ప్రపంచాన్ని ఊపేసిన 'గంగ్నమ్ స్టైల్' గుర్తుందిగా?.. యూట్యూబ్ ద్వారా ఆదాయం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సంగీత ప్రపంచాన్ని ఒకప్పుడు ఊపేసిన పాట 'గంగ్నమ్ స్టైల్' గుర్తుందా? సరిగ్గా 14 ఏళ్ల క్రితం, 2012లో దక్షిణ కొరియా గాయకుడు సై (PSY) పాడిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విచిత్రమైన మ్యూజిక్ వీడియో, గుర్రపు స్వారీని పోలిన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టెప్పులతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'గంగ్నమ్ స్టైల్' వీడియో ఎంతగా వైరల్ అయ్యిందంటే.. యూట్యూబ్ చరిత్రలోనే 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి వీడియోగా రికార్డు సృష్టించింది. విడుదలై 14 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఈ పాటకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం దాదాపు 6 బిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన మ్యూజిక్ వీడియోల్లో ఒకటిగా కొనసాగుతోంది.
వివరాలు
8 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం..
యూట్యూబ్ ద్వారా 'గంగ్నమ్ స్టైల్' ఎంత ఆదాయం సంపాదించి ఉంటుందనే ప్రశ్నకు 'ఎక్స్' (ట్విట్టర్)లో ఓ యూజర్ అడిగాడు.
దీనికి 'గ్రోక్' అనే ఏఐ చాట్‌బాట్ ఆసక్తికరమైన అంచనాలు వెల్లడించింది.
ఈ పాట ద్వారా వచ్చిన మొత్తం ఆదాయానికి సంబంధించిన కచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవని పేర్కొంది.
అయితే 2013లో ఈ వీడియో 1.2 బిలియన్ వ్యూస్ సాధించిన సమయంలోనే ప్రకటనల ద్వారా 8 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చినట్లు గూగుల్ వెల్లడించిన విషయాన్ని గుర్తుచేసింది.
వివరాలు
ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 1 నుంచి 3 డాలర్ల వరకు ఆదాయం..
ప్రస్తుతం ఉన్న వ్యూస్ సంఖ్య, మ్యూజిక్ వీడియోలకు సాధారణంగా లభించే ప్రకటనల రేట్లను పరిగణనలోకి తీసుకుంటే.. 'గంగ్నమ్ స్టైల్' హక్కుదారులు కేవలం యూట్యూబ్ ప్రకటనల ద్వారానే కొన్ని పదుల మిలియన్ల డాలర్లు, అంటే వందల కోట్ల రూపాయలు సంపాదించి ఉండవచ్చని గ్రోక్ అంచనా వేసింది.
ప్రతి 1,000 వ్యూస్‌కు సుమారు 1 నుంచి 3 డాలర్ల వరకు ఆదాయం లభిస్తుందని లెక్కించింది.
ఇక ఈ పాటపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పేరడీలు, కవర్ సాంగ్స్ ద్వారా కూడా 'కంటెంట్ ఐడీ' రూపంలో అదనపు ఆదాయం వచ్చి ఉండవచ్చని గ్రోక్ తెలిపింది.
ఇదే అంశంపై మెటా సంస్థ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..
Exact revenue isn't publicly disclosed. In early 2013 Google said the video generated over $8M in ad revenue at ~1.2B views (creators keep roughly half).
— Grok (@grok) August 18, 2026
With 6.03B views now, using typical music RPM rates of $1–3 per 1,000 views, the rightsholders have likely earned in the…