Sonu Sood: నటుడు సోనూసూద్‌కు లథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు సోనుసూద్ (Sonu Sood) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి హాజరుకాలేని కారణంగా పంజాబ్‌లోని లుథియానా కోర్టు ఈ ఉత్తర్వులను విడుదల చేసింది.
ముంబయిలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని ఒషివారా పోలీస్ స్టేషన్‌కు, లుథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.
సోనూసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వివరాలు
మోసం కేసు వివరాలు
లుథియానా కి చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా, మోహిత్ శర్మ అనే వ్యక్తి తనను ₹10 లక్షలు మోసం చేశాడని కోర్టులో ఫిర్యాదు చేశారు.
రిజికా కాయిన్ పేరుతో పెట్టుబడి పెట్టించారని తన వాదన. ఈ కేసులో సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.
కోర్టు నిర్ణయం
విచారణ చేపట్టిన కోర్టు సోనూసూద్ పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
''పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ, ఆయన హాజరుకాలేదు. కావున వెంటనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి" అని మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 10న జరగనుంది.
వివరాలు
సినిమాల విషయానికి వస్తే..
తెలుగు, బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ కొవిడ్ సమయంలో తన దాతృత్వం ద్వారా అనేక మందిని ఆదుకున్న విషయం అందరికీ తెలిసిందే.
సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన 'ఫతేహ్' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
సైబర్ మాఫియా కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో జాక్వెలైన్ ఫెర్నాండెజ్, నసీరుద్దీన్ షా, విజయ్‌రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.
జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.