NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2 : పుష్ప2పై దేవిశ్రీ కీలక వ్యాఖ్యలు..  గంగమ్మ అమ్మవారిపై సన్నివేశాలు సినిమాకే హైలెట్ అట 
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2 : పుష్ప2పై దేవిశ్రీ కీలక వ్యాఖ్యలు..  గంగమ్మ అమ్మవారిపై సన్నివేశాలు సినిమాకే హైలెట్ అట 

    Pushpa 2 : పుష్ప2పై దేవిశ్రీ కీలక వ్యాఖ్యలు..  గంగమ్మ అమ్మవారిపై సన్నివేశాలు సినిమాకే హైలెట్ అట 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 21, 2023
    05:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప సినిమా,మరోసారి పుష్ప2 నేపథ్యంలో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది.

    ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కీలక కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.

    ఓ వైపు పుష్ప 2 చిత్రీకరణ దశలో ఉండగా సినిమాకు సంబంధించిన కీలక విషయాలు లీక్ అయ్యాయి.

    చిత్రీకరణ దశలో ఉన్న పుష్ప 2 సినిమా స్క్రీన్ ప్లే ఉత్కంఠ రేపుతోంది. జాతర నేపథ్యంలో గంగమ్మ అమ్మవారి వేషధారణలో అల్లు అర్జున్ మీద తెరకెక్కించిన సన్నివేశాలు హైలెట్'గా నిలవనున్నాయని దేవిశ్రీ సంచలన ప్రకటన చేశారు.

    గంగమ్మ గెటప్'లో అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే మాస్ వైరల్ అయ్యింది.

    అమ్మవారి వేషధారణలో భారీ యాక్షన్ సీన్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది.దేవిశ్రీ కామెంట్స్ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.

    details

    ఆగస్ట్ 15న రానున్న పుష్ప-2

    అయితే సెకెండ్ ఆఫ్'లో పుష్ప ది రూల్ బడ్జెట్ రూ. 350 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ జోడిగా రష్మిక మందాన్న మరోసారి ఆడిపాడనుంది.

    ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో అదరగొట్టనున్నారు. మరోవైపు స్టార్ డైరెక్టర్ దేవిశ్రీ మ్యూజిక్ అదరగొడుతున్నారు.

    తొలుత పుష్పని పాన్ ఇండియా రేంజ్ అనుకోలేదట.కానీ షూటింగ్ మొదలయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ బృందం వెల్లడించింది.

    బాలీవుడ్'లో వంద కోట్లకుపైగా వసూళ్లు చేసిన పుష్ప, మొత్తంగా రూ.360 కోట్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025