Loading...
King vs King 100: వాయిదా వార్తలకు చెక్‌.. డిసెంబర్‌ 24నే 'కింగ్‌' రిలీజ్‌.. షారుక్‌ ఖాన్‌ పోస్ట్‌ వైరల్‌!
వాయిదా వార్తలకు చెక్‌.. డిసెంబర్‌ 24నే 'కింగ్‌' రిలీజ్‌.. షారుక్‌ ఖాన్‌ పోస్ట్‌ వైరల్‌!

King vs King 100: వాయిదా వార్తలకు చెక్‌.. డిసెంబర్‌ 24నే 'కింగ్‌' రిలీజ్‌.. షారుక్‌ ఖాన్‌ పోస్ట్‌ వైరల్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2026
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో, దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'కింగ్‌' (King). ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ షారుక్‌ ఖాన్‌ స్వయంగా తన సినిమా గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే డిసెంబర్‌ 24న 'కింగ్‌' ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పష్టం చేశారు.

వివరాలు

'నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని'

షారుక్‌ ఖాన్‌ 'కింగ్‌' సినిమాలోని ఓ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీనికి ''ఈరోజు నేను మళ్లీ చెబుతున్నా.. నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని'' అనే క్యాప్షన్‌ జోడించారు.

దీంతో సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పడింది. డిసెంబర్‌ 24న విడుదల కానున్నట్లు మరోసారి స్పష్టత వచ్చింది. 'పఠాన్‌' తర్వాత దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌, షారుక్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వస్తున్న మరో స్పై యాక్షన్‌ చిత్రమిది.

ఈ సినిమాలో షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన 'కింగ్‌' వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

వివరాలు

అదే రోజున నాగార్జున 'కింగ్‌ 100' కూడా!

''ప్రపంచం నాకు ఒక పేరు ఇచ్చింది.. అదే 'కింగ్‌'' అంటూ విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

తాజాగా షారుక్‌ ఖాన్‌ చేసిన పోస్ట్‌తో అభిమానుల్లో సినిమా విడుదలపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి.

మరోవైపు, టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున నటిస్తున్న వందో సినిమా కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.

రా. కార్తీక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'కింగ్‌ 100' అనే పేరు పెట్టారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన రోజే డిసెంబర్‌ 24గా ఖరారు చేశారు.

దీంతో ఈ క్రిస్మస్‌ సందర్భంగా బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికర పోటీకి రంగం సిద్ధమవుతోంది.

ADVERTISEMENT