NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్యార్ లోనా పాగల్ పాటతో రానున్న రవితేజ రావణాసుర
    తదుపరి వార్తా కథనం
    ప్యార్ లోనా పాగల్ పాటతో రానున్న రవితేజ రావణాసుర
    రావణాసుర సినిమా నుండి వస్తున్న సెకండ్ సింగిల్

    ప్యార్ లోనా పాగల్ పాటతో రానున్న రవితేజ రావణాసుర

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 13, 2023
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ డూపర్ విజయాలు అందుకున్న రవితేజ, ప్రస్తుతం రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

    ధమాకాతో వందకోట్లు, వాల్తేరు వీరయ్యతో 200కోట్లు కొల్లగొట్టిన రవితేజ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అందువల్ల రావణాసుర సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

    ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడని అభిమానులు అనుకుంటున్నారు. చిన్నపాటి గ్లింప్స్ వీడియోలో ఎక్కువ రక్తం కనిపించడం, రవితేజ తప్ప ఇంకెవరూ లేకపోవడం, సినిమా పేరు రావణాసుర కావడం వల్ల ఆ విధంగా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

    రావణాసుర నుండి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రావణాసుర ఆంథెమ్ విడుదలైంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమైంది.

    రవితేజ

    ధమాకా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ప్యార్ లోనా పాగల్

    ఫిబ్రవరి 18వ తేదీన ప్యార్ లోనా పాగల్ పూర్తి పాటను రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటకు సంగీతాన్ని హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ఇద్దరూ సంయుక్తంగా అందించారు.

    పాట రిలీజ్ అవుతుందంటూ పోస్టర్ ని వదిలింది బృందం. అందులో రవితేజ లుక్ అదిరిపోయింది. బ్లాక్ సూట్ లో డ్యాన్సింగ్ ఫోజ్ లో అభిమానులను ఉర్రూతలూగించేలా ఉంది. చూస్తుంటే మంచి డాన్స్ నంబర్ లా కనిపిస్తోంది.

    అనూ ఇమ్మాన్యూయల్, మేఘా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, దక్షా నగర్కార్ ఇంకా పూజిత పొన్నాడ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. సుధీర్ వర్మ దర్శకత్వం చేస్తున్నాడు. ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తెలుగు సినిమా

    2024 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని రెడీ అవుతున్న సినిమాలివే సినిమా
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం ట్రైలర్ టాక్
    ధమాకా తో వందకోట్లు కొల్లగొట్టిన రవితేజ నెగెటివ్ రోల్స్ చేయబోతున్నాడా? సినిమా
    రెండు భాగాలుగా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఓజీ పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025