NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ధమాకా తో వందకోట్లు కొల్లగొట్టిన రవితేజ నెగెటివ్ రోల్స్ చేయబోతున్నాడా?
    తదుపరి వార్తా కథనం
    ధమాకా తో వందకోట్లు కొల్లగొట్టిన రవితేజ నెగెటివ్ రోల్స్ చేయబోతున్నాడా?
    మల్టీస్టారర్ కోసం కథలో మార్పులు చేయమని రవితేజ చెప్పినట్లుగా మార్పులు

    ధమాకా తో వందకోట్లు కొల్లగొట్టిన రవితేజ నెగెటివ్ రోల్స్ చేయబోతున్నాడా?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 31, 2023
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాస్ మహరాజ్ రవితేజ, డీజేటిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి వెండితెరను పంచుకోనునున్నట్లు తెలుస్తోంది.

    ఈ మల్టీస్టారర్ కూడా ఓ రీమేక్ కోసమని సమాచారం. తమిళంలో విజయం అందుకున్న మానాడు సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. మానాడు సినిమాలో హీరోగా శింబు, విలన్ గా ఎస్ జె సూర్య కనిపించారు.

    ప్రస్తుతం ఎస్ జే సూర్య పాత్రను తెలుగులో రవితేజ చేస్తాడని అంటున్నారు. కాకపోతే ఈ పాత్రకు నెగెటివి షేడ్స్ ఉంటాయి. హీరోని ఎదిరించే పాత్ర అది. ప్రస్తుతం రవితేజ ఖాతాలో వరుసగా వందకోట్ల సినిమాలు ధమాకా, వాల్తేరు వీరయ్య ఉన్నాయి.

    అందుకే ఈ టైమ్ లో నెగెటివ్ పాత్రల్లో కనిపించడం కరెక్ట్ కాదని రవితేజ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

    రవితేజ

    కథలో మార్పులు చేయమని రవితేజ చెప్పినట్లు వార్తలు

    నెగెటివ్ పాత్రలో కాకుండా హీరోగా శింబు పాత్రలో రవితేజ చేస్తే, ఎస్ జే సూర్య పాత్రకు సిద్ధు జొన్నలగడ్డకు సెట్ కాడని చిత్రబృందం ఆలోచిస్తుందట. అందుకే, కథలో మార్పులు చేయమని రవితేజ సూచించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    ఎస్ జే సూర్య పాత్రను పూర్తి నెగెటివ్ గా చూపించకుండా ఉండాలని రచయితల బృందం పనిచేస్తుందని సమాచారం.

    మానాడు సినిమాలో కాలంలో చిక్కుకుపోవడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎస్ జే సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు.

    ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగానే ఉంటుందనే వాళ్ళు కొందరైతే, ఓటీటీల ద్వారా బయటకు వచ్చేసాక రీమేక్ చేయడం అంత మంచిది కాదని మరికొందరు అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలుగు సినిమా

    కేజీఎఫ్ హీరోయిన్ కి తెలుగులో అవకాశం, సీనియర్ హీరో సరసన? సినిమా
    వీరసింహారెడ్డి: అమెరికాలో హాఫ్ మిలియన్ దాటేసిన కలెక్షన్లు వీరసింహారెడ్డి
    వీరసింహారెడ్డి రివ్యూ: బాలయ్య అభిమానులకు పండగే వీరసింహారెడ్డి
    జబర్దస్త్: పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ కి కిర్రాక్ ఆర్పీ సాయం సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025