ఓటీటీ అలర్ట్: రవితేజ, రష్మిక, రకుల్ నటించిన కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్
థియేటర్లో మిస్సయిన సినిమాలు ఓటీటీలో చూద్దామని ఎదురుచూస్తున్నారా? ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకుందాం. ధమాకా: రవితేజ కెరీర్లో వందకోట్ల కలెక్షన్లు సాధించిన మొదటి చిత్రంగా నిలిచిన ధమాకా, ఈ నెల 22వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది. ధమాకాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మిషన్ మజ్ను: ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది హీరోయిన్ రష్మిక మందన్న. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కనిపించిన ఈ చిత్రం, ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఛత్రీవాలీ: రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ చిత్రం, ఈరోజు నుండి జీ 5లో అందుబాటులో ఉంటుంది.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సిరీస్ లు
యూత్ ఆఫ్ మే: ఈ మధ్య కొరియన్ డ్రామాలను తెలుగులోకి అనువదిస్తున్న ఆహా, తాజాగా యూత్ ఆఫ్ మే అనే సిరీస్ ని తీసుకొచ్చింది. జనవరి 21వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది. అలాగే ఆహాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన డ్రైవర్ జమున జనవరి 20వ తేదీన రిలీజ్ అవుతుంది. ఝాన్సీ సీజన్ 2: అంజలి ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నిన్నటి నుండి అందుబాటులోకి వచ్చింది. ఇంకా లాస్ట్ మ్యాన్ ఫౌండ్ అనే సిరీస్ జనవరి 20 నుండి స్ట్రీమ్ హాట్ స్టార్ లోకి వస్తుంది. కాపా అనే మళయాలం మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.