రవితేజ ఖాతాలో వంద కోట్ల సినిమా, ధమాకా మామూలుగా పేలలేదుగా
కరోనా తర్వాత సినిమా మారిపోయింది. సినిమాలు చూసే జనాలు మారిపోయారు. ఇప్పుడు సినిమా అంటే ఎవ్వరూ ఊహించని విధంగా ఉండాలి. ఎక్కడా దొరకని ఎంటర్ టైన్ మెంట్ అందివ్వాలి అని రకరకాల మాటలు బయటకు వచ్చాయి. కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందని, ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించే సినిమాలే థియేటర్లలో నడుస్తాయని ఇండస్ట్రీ అనుకుంది. కానీ సినిమాలు ఇలానే ఉండాలి అనే దానికి అర్థం లేదని, ఏ సినిమా అయినా జనాలను ఎంటర్ టైన్ చేస్తే అది సక్సెస్ అని నిరూపించింది ధమాకా. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపింది. మ్యాజికల్ నంబర్ వందకోట్ల వసూళ్ళను సాధించి మాస్ సినిమా రేంజ్ ఏంటో చూపించింది.
అంతా రవితేజ వల్లే
సినిమా విడుదలైన రెండు వారాల్లోనే వంద కోట్ల మార్కును అందుకుని మాస్ మంత్రం ఎంతలా పనిచేస్తుందో మరోమారు నిరూపించింది ధమాకా. ఈ సినిమాలో రవితేజ ఎనర్జీ వేరే లెవెల్లో కనిపించింది. రెగ్యులర్ మాస్ సినిమా అయినా కూడా రవితేజ లోని మాస్ పవర్, ఈ సినిమాను వందకోట్ల వరకూ తీసుకొచ్చింది. రవితేజ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ధమాకా చిత్రం. హీరోయిన్ శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్ సెసిరోలియో అందించిన అద్భుతమైన సంగీతం ధమాకా సినిమాకు బాగా కలిసి వచ్చాయి. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.