LOADING...
R Madhavan: డబ్బు సంపాదించమని నన్ను నా భార్య ఇంటి నుంచి గెంటేసింది: సరదా విషయం పంచుకున్న మాధవన్
సరదా విషయం పంచుకున్న మాధవన్

R Madhavan: డబ్బు సంపాదించమని నన్ను నా భార్య ఇంటి నుంచి గెంటేసింది: సరదా విషయం పంచుకున్న మాధవన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొవిడ్‌ కాలంలో తన ఇంట్లో చోటుచేసుకున్న ఒక సంఘటనను ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ (R. Madhavan) తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఇంట్లో ఉండటాన్ని చూసి భార్య సరిత ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందంటూ సరదాగా చెప్పారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాధవన్‌, ఇటీవల ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి వివరించారు.

వివరాలు 

కామెంట్స్ వైరల్

''కొవిడ్‌ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. అప్పుడు నా భార్య వచ్చి.. 'నువ్వు ఇలా ఖాళీగా ఉండడం ఎప్పుడూ చూడలేదు.. కామెడీ, యాక్షన్‌, ఓటీటీ సినిమాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్‌లో నటిస్తూనే ఉంటావు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. వర్క్‌కు వెళ్లినా త్వరగా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నావు. నువ్వు బాగానే ఉన్నావా, ఎప్పటిలానే బయటకు వెళ్లి, డబ్బులు సంపాదించు.' అని అన్నది. ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. నన్ను నేను పరిశీలించుకున్నా'' అని మాధవన్‌ వివరించారు. అయితే ఆయన ఈ విషయాన్ని సరదాగా వెల్లడించారు. 'నా భార్య కొవిడ్‌ సమయంలో డబ్బు సంపాదించమని నన్ను గెంటేసింది' అని చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.

వివరాలు 

4 సంవత్సరాల విరామం

ఇక మాధవన్‌ ఇటీవల తన కెరీర్‌లో విరామం తీసుకోవడం గురించి కూడా మాట్లాడారు. 2011 నుంచి 2015 వరకు 4 సంవత్సరాల విరామం తీసుకున్న ఆయన 2016లో 'సాలా ఖదూస్‌'తో తిరిగి అలరించడం ప్రారంభించారు. పనిపై ఆసక్తి తగ్గడంతో ఈ విరామాన్ని తీసుకోవలసి వచ్చిందని మాధవన్‌ వివరించారు.

Advertisement