Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం.. అయినా ఆ కిక్ మిస్సే!
ఈ వార్తాకథనం ఏంటి
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'జైలర్' తర్వాత భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సీక్వెల్ 'జైలర్ 2' తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి 'టైగర్ ముత్తువేల్ పాండియన్'గా తెరపై కనిపించి తనదైన స్టైల్, స్వాగ్‌తో ఆకట్టుకున్నారు. పార్ట్-1లో విలన్ వర్మన్‌ను అంతం చేసిన తర్వాత కూడా ముత్తువేల్ పాండియన్ ఎక్కడికీ పారిపోలేదని, అతడిని పట్టుకోవడం ఎవరి వల్లా కావడం లేదనే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. "అసలు ఎవడతను? అతడి వెనుక ఇంకెవరున్నారు?" అంటూ విలన్ గ్యాంగ్స్ భయపడే సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి.
వివరాలు
కొన్ని షాట్లు అద్భుతం
వీటితో పాటు నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్‌తో కూడిన కొన్ని షాట్లు కూడా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా.. "శత్రువులందరినీ ఒకే గూటికి పిలిచి.. ఒకేసారి బాంబుతో లేపేయడమే ఇప్పటి ట్రెండ్" అనే డైలాగ్ రజనీకాంత్ మార్క్ స్వాగ్‌ను గుర్తుచేసింది.
అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎప్పటిలాగే కొన్ని ఫ్రేమ్స్‌ను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది.
అయితే ట్రైలర్ చూడటానికి బాగానే ఉన్నప్పటికీ.. సగటు సినీ ప్రియుడికి మాత్రం ఏదో తెలియని అసంతృప్తి మిగిలిపోతున్నట్లు అనిపిస్తోంది. 'జైలర్' ఫస్ట్ పార్ట్ ఇచ్చిన అడ్రినలిన్ రష్, గూస్‌బంప్స్ మూమెంట్స్‌తో పోల్చితే.. 'జైలర్ 2' ట్రైలర్ ఆ స్థాయి కిక్ ఇవ్వలేకపోయిందనే భావన కలుగుతోంది.
వివరాలు
ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్
ఫస్ట్ పార్ట్‌లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి ఇతర ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజాల క్యామియోలు, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండింది.
అయితే 'జైలర్ 2' ట్రైలర్‌ను గమనిస్తే.. రొటీన్ రివేంజ్ డ్రామాకు కాస్త డార్క్ కామెడీని జోడించి కథను ముందుకు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది.
ఫస్ట్ పార్ట్‌లో కనిపించిన ఫ్రెష్‌నెస్ ఇందులో కనిపించలేదనే ఫీలింగ్ కలుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాగ్ ఉన్నప్పటికీ.. కంటెంట్‌లో మాత్రం స్టార్ కాస్ట్ కనిపించినంత స్థాయిలో మెరుపులు లేవనిపిస్తోంది.
సినిమాలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇంకేమైనా సర్‌ప్రైజ్‌లు దాచిపెట్టారా? అనేది చూడాలి.
మరి థియేటర్లలో 'జైలర్ 2'తో నెల్సన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.