LOADING...
Raksha Bandhan: రాఖీ స్పెషల్‌.. అన్నా చెల్లెళ్ల ప్రేమను ప్రతీకగా సినిమాలు ఇవే!
రాఖీ స్పెషల్‌.. అన్నా చెల్లెళ్ల ప్రేమను ప్రతీకగా సినిమాలు ఇవే!

Raksha Bandhan: రాఖీ స్పెషల్‌.. అన్నా చెల్లెళ్ల ప్రేమను ప్రతీకగా సినిమాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాఖీ పండగ అనేది అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని, ప్రేమను ప్రతిబింబించే అనుబంధ దినోత్సవం. ఈ రోజు ప్రతి ఒక్క చెల్లెలు తన అన్నకు రక్షబంధన్ కట్టి, అతని రక్షణ కోసం ప్రార్థించగా.. అన్న తన చెల్లెలికి జీవితాంతం కాపాడతానన్న వాగ్దానం ఇస్తాడు. 'అమ్మ' అనే పదంలో మొదటి అక్షరం, 'నాన్న' అనే పదంలో చివరి అక్షరం కలిసినప్పుడు వచ్చే పదమే 'అన్న'. ఈ పదంలో అమ్మలోని అనురాగం, నాన్నలోని అభిమానం కలసి ఒక మహత్తరమైన బంధంగా మారుతుంది. ఇలాంటి పవిత్రమైన అనుబంధాన్ని పలువురు దర్శకులు వెండితెరపై తీసుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో అన్నా-చెల్లెళ్ల అనుబంధాన్ని ప్రధానంగా చూపిస్తూ రూపొందిన ఎన్నో సెంటిమెంటల్ హిట్ చిత్రాలు మనకు గుర్తుండేలా ఉంటాయి.

Details

సినిమాలపై ఓ లుక్కేయండి

1) చిరంజీవి నటించిన 'హిట్లర్', అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని మేల్కొల్పిన సినిమా. 2) బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ముద్దుల మావయ్య' సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఘనవిజయం సాధించింది. 3) కోడి రామకృష్ణ దర్శకత్వంలో అర్జున్ ప్రధాన పాత్రలో వచ్చిన 'పుట్టింటికి రా.. చెల్లి' చిత్రం సోదరి అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. 4) మహేష్ బాబు నటించిన 'అర్జున్'లో అక్కా-తమ్ముళ్ల అనుబంధాన్ని గొప్పగా చూపించారు. 5) మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే అన్న పాత్రలో తారక్ నటించిన 'రాఖీ', సిస్టర్ సెంటిమెంట్‌కు మరో గుర్తుగా నిలిచింది. 6) పవన్ కళ్యాణ్ నటించిన 'అన్నవరం'లో అన్నా చెల్లెళ్ల అనుబంధం ప్రధానంగా ఉంది. 7) రాజశేఖర్ ప్రధాన పాత్రలో వచ్చిన 'గోరింటాకు' అన్నా చెల్లెల్ల అనురాగానికి చక్కని ఉదాహరణ.

Details

అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేసే సినిమాలు

8) ఎన్టీఆర్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన 'రక్త సంబంధం', అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేసే ప్రథమ చిత్రం అనే చెప్పాలి. 9) శోభన్ బాబు నటించిన 'జీవనరాగం', 'చెల్లెలు కాపురం' వంటి చిత్రాలు కూడా ఇదే భావోద్వేగం ఆధారంగా నిర్మించారు. 10) వెంకటేష్ నటించిన 'గణేష్', సోదర అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. 11) అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'బంగారు గాజులు', 'ఆత్మీయులు' వంటి పలు చిత్రాల్లో సిస్టర్ సెంటిమెంట్ గాఢంగా చూపించారు. 12) 'శివరామరాజు' సినిమాలో కూడా అన్నాచెల్లెళ్ల అనుబంధం ప్రధానాంశంగా నిలిచింది. 13) సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'సంప్రదాయం'కూడా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందింది. 14) 'పల్నాటి పౌరుషం' చిత్రంకూడా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనం.