
Peddi: అదిరిపోయిన 'పెద్ది'ఫస్ట్ హాఫ్ .. ఫాన్స్ కి ఇక రచ్చ రచ్చే
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఈ ప్రయత్నంలో భాగంగా, ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో "పెద్ది" (Peddi) అనే కొత్త చిత్రం ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ను వృద్ధి సినిమాస్, IVY ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్స్ పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక విలన్ పాత్రలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులలో గొప్ప హైప్ సృష్టించి, ఈ సినిమా గురించి అందరికి భారీ అంచనాలను ఏర్పరిచాయి.
వివరాలు
పూర్తయిన ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్
మొదటి నుంచి కూడా "పెద్ది"పై అభిమానుల్లో గొప్ప ఆశలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే, బుచ్చిబాబు సినిమాను వేరే లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే సుమారుగా 60% షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ షూటింగ్ ఫుటేజ్ ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఉంది అని తెలుస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ హాఫ్ ఎడిట్ పూర్తి అయ్యింది. అవుట్ ఫుట్ చూసిన రామ్ చరణ్ పూర్తిగా సంతోషంగా ఉన్నారని సమాచారం వస్తోంది. రేపటి నుంచి పూణేలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై ఒక సాంగ్ షూట్ ప్రారంభం కానుంది. ఈ సాంగ్ కి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
"పెద్ది" రామ్ చరణ్ కెరీర్ లో భారీ హిట్
పెద్దికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధం అవుతుంది. మ్యూజిక్ పరంగా పెద్ది బ్లాక్ బస్టర్ అవుతుందని, రెహమాన్ మ్యూజిక్ అదరగొట్టాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈసారి "పెద్ది" రామ్ చరణ్ కెరీర్ లో భారీ హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అందుకే పెద్ది నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. రామ్ చరణ్ తన అభిమానుల అంచనాలను "పెద్ది"తో నిజం చేస్తాడా లేదా అనేది చూడాలి.