తదుపరి వార్తా కథనం
Saaree Trailer: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ 'శారీ' ట్రైలర్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 12, 2025
12:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందుతున్న తాజా చిత్రం 'శారీ'.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఆరాధ్య దేవి కథానాయికగా నటిస్తుంది. వర్మ ఈ సినిమాకు కథ అందించగా, గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు.
ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌లో చీర కట్టులో ఉన్న అమ్మాయిని చూసిన ఓ యువకుడు ఆమెతో ప్రేమలో పడిన తర్వాత, అతని జీవితం ఏవిధంగా మారిపోయింది అనేదే ఈ కథాంశంగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.