
రీల్స్ లో కనిపించిన అమ్మాయితో శారీ సినిమా తీస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని మార్చేసిన డైరెక్టర్.
ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు తీస్తూ ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటున్నారు.
వర్మ సినిమాల కన్నా సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా మారుతాయన్న సంగతి తెలిసిందే.
తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒకానొక రీల్ వీడియోను పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో ఒక అమ్మాయి చీర కట్టుకొని వయ్యారంగా నిల్చుని ఉంది.
అయితే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టండని తన ఫాలోవర్లకు రిక్వెస్ట్ చేశారు. మరుసటి రోజుకి ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరికాయని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Details
చీర సినిమా తీస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ
అన్ని డ్రెస్సులలో కన్నా అమ్మాయిలు చీరలో చాలా అందంగా ఉంటారని చెప్తారు. కానీ నేను నమ్మలేదు. ఈ అమ్మాయిని చీరలో చూస్తుంటే ఆ విషయం నిజమే అనిపిస్తుంది.
చీరలో అమ్మాయిని చూస్తుంటే శారీ అనే సినిమా తీసేయాలనిపిస్తుందని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
దీంతో ఒక్కసారిగా చీరలో కనిపించిన ఆ అమ్మాయి వైరల్ ఐపోయింది. ఒక్కసారిగా ఆమె అకౌంట్ కి ఫాలోవర్ల వరద పెరిగింది.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే?
మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ శ్రీ లక్ష్మీ సతీష్. నటిగా ఎదగడానికి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తోంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కారణంగా ఆమె మరింత పాపులర్ అయ్యింది.