తదుపరి వార్తా కథనం

అందమైన అమ్మాయిని చూపించి ఆమె వివరాలు అడిగిన రామ్ గోపాల్ వర్మ
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Sep 27, 2023
05:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లో అగ్రదర్శకుడు, విభిన్న శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే రామ్ గోపాల్ వర్మ మరోసారి అదే సరళిని ప్రదర్శించాడు.
వర్మ కెమెరా దృష్టి, కొత్త కోణాల కోసం వెంపర్లాడుతుంటుంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ దర్శకుడు, ఓ అమ్మాయి వీడియో పెట్టి ఈవిడ ఎవరూ అంటూ చేసిన పోస్టు రచ్చ చేస్తోంది.
చీరకట్టుతో అందాలను ఓలికిస్తున్న ఓ యువతి, చేతిలో కెమెరాతో వయ్యారాలు ఒలకబోయడాన్ని వర్మ ట్వీట్ చేశారు.
ఈ మేరకు సదరు వీడియోలో ఉన్న కెమెరా సుందరి పేరు, ఊరు తెలియక వర్మ మథనపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఈవిడ ఎవరో నాకు చెబుతారా అంటూ ఆరా తీస్తున్నారు. వర్మ ఆరాటపడుతున్న అమ్మాయిపై నెట్టింట ఫోకస్ పెరగడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈ అమ్మాయి ఎవరో, ఎవరైనా చెప్పగలరా : ఆర్జీవీ
Can someone tell me who she is ? pic.twitter.com/DGiPEigq2J
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2023