Loading...
Ramayana Advance Sales: రిలీజ్‌కు ముందే రామాయణం రికార్డుల వేట.. ప్రీ సేల్స్‌లో రూ.100 కోట్లు!
రిలీజ్‌కు ముందే రామాయణం రికార్డుల వేట.. ప్రీ సేల్స్‌లో రూ.100 కోట్లు!

Ramayana Advance Sales: రిలీజ్‌కు ముందే రామాయణం రికార్డుల వేట.. ప్రీ సేల్స్‌లో రూ.100 కోట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహాకావ్యం 'రామాయణం' వెండితెరపై అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి ఈ విజువల్ వండర్‌ను రూపొందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే గ్లోబల్ ప్రీ-సేల్స్‌లో రూ.100 కోట్ల మార్కును దాటేసింది. మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రూ.105 కోట్లకు చేరుకోవడంతో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

వివరాలు

పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ జోరు

'రామాయణం' సినిమా విడుదలకు 15 రోజుల ముందుగానే దసరా సందర్భంగా చిత్ర బృందం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది.

అయితే డిస్ట్రిబ్యూటర్ ధర్మ ప్రొడక్షన్స్, థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో చర్చలు జరగడంతో తొలుత సింగిల్ స్క్రీన్లలో టికెట్లు అందుబాటులోకి రాలేదు.

గత శుక్రవారం ఈ సమస్య పరిష్కారం కావడంతో బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శనకు అందుబాటులో ఉన్న స్క్రీన్ల సంఖ్య 5,000 దాటింది.

గత 24 గంటల్లోనే అదనంగా సుమారు 1,500 స్క్రీన్లు పెరిగాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ మరింత వేగం పుంజుకున్నాయి.

వివరాలు

భారత మార్కెట్‌లో రూ.58 కోట్ల ప్రీ-సేల్స్

దేశీయ మార్కెట్‌లోనూ 'రామాయణం'కు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ సినిమా రూ.58 కోట్ల ప్రీ-సేల్స్ నమోదు చేసింది.

ఇందులో తొలి రోజు గ్రాస్ వసూళ్లే రూ.27 కోట్లుగా ఉండటం విశేషం. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా వీకెండ్‌కు కూడా టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది.

శని, ఆదివారాల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.25 కోట్లకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 15 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొత్తం థియేటర్లలో కేవలం 4 శాతం మాత్రమే అందుబాటులో ఉన్న ఐమాక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లు మొత్తం టికెట్ అమ్మకాల్లో దాదాపు పావు వంతు వాటాను దక్కించుకున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

ఓవర్సీస్‌లోనూ భారీ స్పందన

విదేశీ మార్కెట్లలోనూ 'రామాయణం'కు మంచి ఆదరణ లభిస్తోంది. ఉత్తర అమెరికాలో నవంబర్ 4న ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఓవర్సీస్ మార్కెట్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

అంటే భారత కరెన్సీలో రూ.41 కోట్లకు పైమాటే. ఇందులో కేవలం అమెరికా ప్రీమియర్ షోల నుంచే 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రూ.105 కోట్లకు చేరుకుంది.

విడుదలకు ముందే రూ.100 కోట్లకు పైగా ప్రీ-సేల్స్ సాధించిన అరుదైన చిత్రాల జాబితాలో 'రామాయణం' చోటు సంపాదించింది.

ADVERTISEMENT