Loading...
Ram Gopal Varma: రణ్‌బీర్, యశ్ నటన అద్భుతం.. 'రామాయణ'పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
రణ్‌బీర్, యశ్ నటన అద్భుతం.. 'రామాయణ'పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు

Ram Gopal Varma: రణ్‌బీర్, యశ్ నటన అద్భుతం.. 'రామాయణ'పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణ: పార్ట్ 1' చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా కేవలం భక్తిరస చిత్రం మాత్రమే కాదని, అదొక 'భక్తి శక్తి' అని అభివర్ణించారు. సినిమాపై వస్తున్న విమర్శలను చిత్రబృందం ఏమాత్రం పట్టించుకోవద్దని సూచించారు.

వివరాలు

విమర్శల కంటే సినిమా కోసం చేసిన కృషి గొప్పది

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా స్పందించిన ఆర్జీవీ.. ఈ చిత్రాన్ని రూపొందించడానికి చిత్రబృందం చేసిన కృషితో పోలిస్తే విమర్శలు చాలా చిన్నవని పేర్కొన్నారు.

సినిమా నిర్మాణం వెనుక ఉన్న ప్రయత్నాన్ని గుర్తించాలని అభిప్రాయపడ్డారు. ఇందులో రాముడి పాత్రను కూడా వర్మ ప్రత్యేకంగా విశ్లేషించారు.

కథానాయకుడు కథకు అతీతంగా తేలియాడే దేవుడు కాదని, ప్రపంచం అంతం కాబోతోందని తెలిసినా ధైర్యంగా ముందడుగు వేసిన ఓ మనిషిగా చూపించారని వ్యాఖ్యానించారు.

సినిమాలోని హింస కూడా దాని పర్యవసానాలను స్పష్టంగా తెలియజేసేలా ఉందని పేర్కొన్నారు.

వివరాలు

రణ్‌బీర్, యశ్ నటనపై ప్రత్యేక ప్రశంసలు

ముఖ్యంగా రాముడిగా నటించిన రణ్‌బీర్ కపూర్, రావణుడిగా కనిపించిన యశ్ అభినయాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా కొనియాడారు.

సీత అపహరణ తర్వాత ఖాళీగా ఉన్న ఆశ్రమంలో రాముడు నిలబడే సన్నివేశాన్ని ప్రస్తావించారు.

ఆ సన్నివేశంలో రణ్‌బీర్ నటనలో దుఃఖం ఒక అంకగణితంగా మారిన తీరును కెమెరా అద్భుతంగా బంధించిందని ప్రశంసించారు.

ADVERTISEMENT

వివరాలు

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 5న విడుదలైంది.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రానికి సినీ ప్రముఖుల నుంచి కూడా విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.

ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ చేసిన తాజా విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ADVERTISEMENT