Loading...
Ranbir Kapoor: ఈ ఒక్కవాచ్‌తో అపార్ట్‌మెంట్‌ కొనేయ్యొచ్చు...రణ్‌బీర్‌ వాచ్‌ స్పెషాలిటీ ఇదే
ఈ ఒక్కవాచ్‌తో అపార్ట్‌మెంట్‌ కొనేయ్యొచ్చు...రణ్‌బీర్‌ వాచ్‌ స్పెషాలిటీ ఇదే

Ranbir Kapoor: ఈ ఒక్కవాచ్‌తో అపార్ట్‌మెంట్‌ కొనేయ్యొచ్చు...రణ్‌బీర్‌ వాచ్‌ స్పెషాలిటీ ఇదే

వ్రాసిన వారు Balachander Sharma
Oct 23, 2026
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ధరించే వాచీలంటే లగ్జరీకి మరో పేరు. ఆయన దగ్గర ఇప్పటికే ఖరీదైన వాచీల కలెక్షన్ ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 'రామాయణం' ప్రమోషనల్ ఈవెంట్‌లో ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ధర అక్షరాలా రూ.35.88 లక్షలు. ఒక చిన్న అపార్ట్‌మెంట్ కొనుగోలుకు సరిపడే ధరతో ఉన్న ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటంటే..

Details

50 వాచీలే.. ప్రత్యేకమైన డిజైన్!

రణ్‌బీర్ ధరించిన ఈ వాచ్ స్విస్ లగ్జరీ బ్రాండ్ జాకబ్ & కో (Jacob & Co.)కు చెందిన 'ఎపిక్ X షేర్-ఎ-పంజాబ్ ఎడిషన్'.

ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 వాచీలను మాత్రమే తయారు చేశారు. భారతదేశంలో దీని ధర సుమారు రూ.35.88 లక్షలుగా తెలుస్తోంది.

ఈ వాచ్ ప్రత్యేకత కేవలం ధరలోనే లేదు. సిక్కు సమాజం, పంజాబ్ సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.

సంప్రదాయానికి ఆధునిక వాచ్‌మేకింగ్ టెక్నాలజీని జోడించడం ఈ ఎడిషన్ ప్రత్యేకత. అందుకే లగ్జరీ వాచ్ కలెక్టర్లలోనూ దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

Details

'రామాయణం'తో బిజీగా రణ్‌బీర్

ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్నారు.

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కనిపించనున్నారు.

లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం 2026 నవంబర్ 5న విడుదల కానుంది.

రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే రణ్‌బీర్.. తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌తోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈసారి మాత్రం ఆయన చేతికి ఉన్న రూ.35.88 లక్షల వాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది

ADVERTISEMENT