Page Loader
Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణం రిలీజ్ డేట్ ఫిక్స్!
సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణం రిలీజ్ డేట్ ఫిక్స్!

Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణం రిలీజ్ డేట్ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ భారతీయుల ఆత్మీయ ఇతిహాసం రామాయణాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో, కేజీఎఫ్ స్టార్ యష్ లంకేశ్వరుడైన రావణుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, నితేష్ తివారీ నవంబర్ 6న విడుదల తేదీ గురించి క్లారిటీ ఇస్తూ ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. మన సంస్కృతి, మన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలనే కలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదలవుతుందని తివారీ తెలిపారు.

Details

సహ నిర్మాతగా అల్లు అరవింద్

ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్‌ కోసం ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే తెలుగు డైలాగ్స్ రాసేందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు బాధ్యత అప్పగించినట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్షన్ కోసం ఏఆర్ రెహమాన్‌తో పాటు ఇతర ప్రతిభావంతులవారి జట్టును తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. రామాయణం వంటి విశిష్ట ఇతిహాసాన్ని ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చేందుకు నితేష్ తివారీ ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్‌ను జట్టుగా ఎంపిక చేస్తున్నారు. ఈ గోల్డెన్ ప్రాజెక్ట్‌కి అల్లు అరవింద్‌ సహ నిర్మాతగా, బాలీవుడ్‌ అగ్ర నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి చేస్తున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోస్టు చేసిన చిత్ర యూనిట్