Rangulu From Ramayana: 'రామాయణ'నుంచి మరో పాట వచ్చేసింది.. 'రంగులు రంగులే'.. ఆకట్టుకుంటున్న రాముడు,సీతల ప్రేమబంధం !
ఈ వార్తాకథనం ఏంటి
రామాయణం నుంచి విడుదలవుతున్న ప్రతి గ్లింప్స్, పాట ఈ ఇతిహాసంలోని కొత్త కోణాన్ని చూపిస్తోంది. తాజాగా విడుదలైన మూడో పాట 'రంగులు రంగులే' శ్రీరాముడు, సీతాదేవి మధ్య ఉన్న అద్భుతమైన ప్రేమబంధాన్ని అందంగా ఆవిష్కరించింది. ఏఆర్ రెహమాన్ తనదైన సంగీతంతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఆకట్టుకునే స్వరాలు, అద్భుతమైన సంగీత వాయిద్యాల సమ్మేళనంతో పాటను ఎంతో మధురంగా తీర్చిదిద్దారు. గేయ రచయిత రాకేందు మౌళి తన హృద్యమైన సాహిత్యంతో రాముడు, సీతల భావోద్వేగాలను, వారి జీవిత ప్రయాణాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఈ పాటను రాఘవ్ కౌశిక్, వైశాలి సామంత్ పాడారు. ఇక పాటలోని దృశ్యాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
వివరాలు
నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు..
స్వయంవరంలో రాముడు,సీత తొలిసారి కలుసుకోవడం నుంచి వారి వివాహం వరకు..అయోధ్యలో కలిసి గడిపిన మధురక్షణాల నుంచి అరణ్యవాస ప్రయాణం వరకు వారి జీవితంలోని కీలక ఘట్టాలను ఈ పాటలో చూపించారు.
ప్రతి సన్నివేశం వారి ప్రేమకథలోని ఆప్యాయతను,భావోద్వేగాలను మరింతగా తెలియజేస్తోంది.
ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్,సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు.
వీరిద్దరూ తెరపై ఎంతో అందంగా కనిపించడంతో పాటు,సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
పాటలో వీరి మధ్య కనిపించే కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది
'రంగులు రంగులే'పాట విన్నవారికి మరోసారి వినాలనిపించేలా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది.మూవీ మొదటి పార్ట్ నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
జానకి రాముల బంధాన్ని చక్కగా వివరించిన పాట. 🎶
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 25, 2026
The Third Single Rangulu Ranguley from #Ramayana out now! 🏹 https://t.co/67hCXCneTP
In cinemas worldwide from 5th November
AP & TG by @SVCRelease pic.twitter.com/U5VlMndrun