LOADING...
Rao Bahadur : సత్యదేవ్ 'రావు బహదూర్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
సత్యదేవ్ 'రావు బహదూర్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Rao Bahadur : సత్యదేవ్ 'రావు బహదూర్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'రావు బహదూర్'. దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

వివరాలు

భారీ మొత్తానికి డిజిటల్  హక్కులు..

సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను సుమారు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్షన్, మేకప్, కాస్ట్యూమ్స్ వంటి విభాగాలపై గణనీయమైన ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. సత్యదేవ్ కెరీర్‌లో ఇప్పటివరకు రూపొందిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'రావు బహదూర్' నిలిచింది. ఇక ఈ సినిమా డిజిటల్ విడుదలకు సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం.

వివరాలు

నెల తర్వాతే ఓటీటీలోకి..

సినిమా ప్రారంభంలో వచ్చే టైటిల్ కార్డులోనే ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని స్పష్టం చేశారు. అందుతున్న సమాచారం మేరకు, థియేటర్లలో విడుదలైన సుమారు నెల రోజుల తర్వాత 'రావు బహదూర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement