Loading...
Rashmika: దీపికను వెనక్కి నెట్టి.. దేశంలోనే నంబర్ 1 హీరోయిన్‌గా రష్మిక మందన్న
దీపికను వెనక్కి నెట్టి.. దేశంలోనే నంబర్ 1 హీరోయిన్‌గా రష్మిక మందన్న

Rashmika: దీపికను వెనక్కి నెట్టి.. దేశంలోనే నంబర్ 1 హీరోయిన్‌గా రష్మిక మందన్న

వ్రాసిన వారు Moogati Shabari
Sep 03, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. కన్నడ చిత్రసీమలో కెరీర్‌ ప్రారంభించి పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్న.. తాజాగా దేశంలోనే నంబర్‌ 1 హీరోయిన్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన జాతీయ స్థాయి పాప్యులారిటీ ర్యాంకింగ్స్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను వెనక్కి నెట్టి రష్మిక అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. ఇది ఆమె కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. 'పుష్ప: ది రైజ్' సినిమాలో శ్రీవల్లి పాత్రతో రష్మిక దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆమెకు పాన్‌ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ వచ్చింది.

వివరాలు

రణబాలి షూట్ లో బిజీ..

ఆ తర్వాత 'యానిమల్' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

ఇక ఇటీవల విడుదలైన 'పుష్ప 2: ది రూల్'తో ఆమె మాస్ ఇమేజ్‌ మరింత పెరిగింది.

దీంతో పాటు 'ఛావా', 'కుబేర' వంటి విభిన్న భాషల చిత్రాల్లో నటిస్తూ.. దేశంలోని పలు చిత్ర పరిశ్రమల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే రష్మిక క్రేజ్‌ కేవలం ఇప్పటికే విడుదలైన సినిమాలతోనే ఆగిపోలేదు.

అక్టోబర్ 16న విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'రణబాలి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ తర్వాత నవంబర్ 27న 'మైసా' విడుదల కానుంది. వీటితో పాటు 'రాకా', 'పుష్ప 3', 'యానిమల్ పార్క్' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా రష్మిక ఖాతాలో ఉన్నాయి.

వివరాలు

రష్మికకు స్టార్ డమ్..

రష్మిక అగ్రస్థానానికి చేరుకోవడం భారతీయ సినిమాలో మారుతున్న ట్రెండ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.

ప్రాంతీయ భాషా చిత్రాల పరిధులు దాటి.. ప్రతిభ ఉన్న నటీనటులకు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది.

రష్మిక ప్రయాణం దీనికి మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

దీపికా పదుకొణె ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో ఒక ఐకాన్‌గా కొనసాగుతున్నప్పటికీ.. పలు భాషల్లో వరుస విజయాలతో రష్మిక తన పాన్‌ ఇండియా స్టార్‌డమ్‌ను మరింత బలోపేతం చేసుకున్నారు.

దీంతో స్టార్‌డమ్‌కు భాషా, ప్రాంతీయ సరిహద్దులు అడ్డంకులు కావని రష్మిక కెరీర్ మరోసారి నిరూపిస్తోంది.

ADVERTISEMENT