Rashmika Mandanna: మా ఆయనతో గడపడానికే ఈ గాయమైందేమో : రష్మిక మందన్న
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల 'మైసా' (Mysaa) సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. షూటింగ్ సమయంలో హిప్ బోన్ దగ్గర టెండన్ తెగిపోవడంతో ఆమెకు తీవ్రమైన గాయం అయింది. దాదాపు నెలన్నర రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్న రష్మిక.. తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న 'రణబాలి' సినిమా షూటింగ్‌లో మళ్లీ పాల్గొంటున్నారు.
వివరాలు
కాలు ఎత్తలేని పరిస్థితిలోనూ షూటింగ్..
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 'మైసా' సినిమా కోసం ఓ పాటను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హిప్ బోన్ దగ్గర టెండన్ తెగిపోయిన సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు అనిపించినప్పటికీ.. నొప్పిని భరిస్తూనే రష్మిక షూటింగ్ కొనసాగించారట.
చివరకు కుడి కాలును పైకి ఎత్తలేని పరిస్థితి రావడంతో షూటింగ్ ఆపినట్లు ఆమె వెల్లడించారు.
మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లి ఎంఆర్‌ఐ (MRI) పరీక్ష చేయించుకోగా వైద్యులు కూడా ఆశ్చర్యపోయారట.
అంత తీవ్రమైన గాయంతోనూ నడుచుకుంటూ ఆస్పత్రికి రావడంపై వారు విస్మయం వ్యక్తం చేసినట్లు రష్మిక తెలిపారు.
ఈ క్రమంలో ఆమె పెయిన్ రిసెప్టర్స్ పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు హెచ్చరించినట్లు చెప్పారు.
వివరాలు
విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత తొలిసారి ఇలా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో, ప్రొడ్యూసర్ విజయ్ దేవరకొండను రష్మిక పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత వరుస ప్రాజెక్టులతో ఇద్దరూ బిజీగా ఉండటంతో దాదాపు మూడు నెలల పాటు ఒకరినొకరు కనీసం కలుసుకోలేకపోయారట.
అయితే ఈ చిన్న గ్యాప్ తమకు ఎన్నో ప్రత్యేకమైన జ్ఞాపకాలను ఇచ్చిందని రష్మిక భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
"మేము పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత ఎక్కువ సమయం కలిసి ఉండటం ఇదే మొదటిసారి.
ప్రకృతి నన్ను ప్రశాంతంగా ఇంట్లో కూర్చోబెట్టి.. మా ఇద్దరికీ ఈ క్వాలిటీ టైమ్ ఇచ్చిందేమో అనిపించింది" అని రష్మిక చెప్పినట్లు తెలుస్తోంది.
విజయ్‌కు సీరియస్ షోలు చూడటం ఇష్టమని, తనకు మాత్రం కే-డ్రామాలు (K-Dramas) అంటే చాలా ఇష్టమని ఆమె తెలిపారు.