మరోమారు వివాదంలోకి రష్మిక మందన్న.. ఈ సారి సౌత్ సినిమాపై కామెంట్లు
పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న, గత కొన్ని రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. మొన్నటికి మొన్న రష్మికను కన్నడ సినిమా నుండి బ్యాన్ చేయాలని అన్నారు. కాంతార సినిమాపై ఆమె మాట్లాడిన మాటలే అందుకు కారణం. ఇప్పుడు సౌత్ సినిమాలపై కామెంట్ చేసి వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది రష్మిక. ఈ సినిమాలోంచి మొదటి పాట రబ్బా జెండాను ఇటీవల విడుదల చేసారు. ఈ ఈవెంట్ లో రష్మిక మాట్లాడుతూ, రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ పాటలే అని, చిన్నప్పటి నుండి బాలీవుడ్ పాటలు వింటూ పెరిగానని చెప్పుకొచ్చింది.
సౌత్ సినిమాల్లో అన్నీ మసాలా పాటలే
సౌత్ సినిమాల్లో మాస్ మసాలా పాటలే ఉంటాయని, ఐటెమ్ సాంగ్స్, డాన్స్ నంబర్స్ తో నిండిపోతాయని మాట్లాడింది. ఈ మాటలపై ఇంటర్నెట్ లో రచ్చ జరుగుతోంది. రష్మిక మాటలు సౌత్ సినిమాను అవమానించినట్లే అని సీరియస్ అవుతున్నారు. కొందరైతే సౌత్ లో వచ్చిన రొమాంటిక్ సాంగ్స్ ని ఆమెకు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ ఎంట్రీతో మరోమారు వివాదంలో చిక్కుకుంది రష్మిక. మరి ఇంటర్నెట్ లో వస్తున్న ట్రోల్స్ కి రష్మిక ఏదైనా సమాధానం ఇస్తుందా లేదా అన్నది చూడాలి. మిషన్ మజ్ను మూవీ 2023 జనవరి 19వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. సంతను బగ్ఛీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమికా చావ్లా ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.